Home తాజా వార్తలు కృష్ణ జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ గడువు ఏడాది పొడిగింపు

కృష్ణ జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ గడువు ఏడాది పొడిగింపు

Brijesh tribunal deadline year extension on krishna water disputes

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీ జలాల్లో వాటాలు ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును మరో ఏడాది కాలం పెంచుతున్నట్టు కేంద్ర జల్ శక్తిశాఖ వెల్లడించింది. 2004 ఏప్రిల్ 2న అప్పటి కేంద్రప్రభుత్వం బ్రజేష్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమల్లోకి రాకముందే ఎపి పునర్విభజన చట్టం మేరకు 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.

దీంతో తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి కేంద్రం కొత్తమార్గదర్శకాలు, విధివిధానాలు నిర్ణయించి ట్రిబ్యునల్ కాలపరిమితిని పోడిగించింది. ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల వాదనలు విని ఈ ఏడాది ఆగష్ట్ ఒకటిలోపు తుది నివేదికనివ్వాల్సివుంది. పలు కారణాల వల్ల వివాదాల విచారణకు సమయం సరిపోకపోవటంతో కాలపరిమితి గడువు మరో ఏడాదిపాటు పొడిగిచాలని బ్రిజేష్ ట్రిబ్యునల్ చేసిన వినతికి కేంద్రం అంగీకరించింది. 2022 ఆగష్ట్ ఒకటిలోపు తుది నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి శాఖ బ్రజేష్ ట్రిబ్యునల్‌కు గుడువు పెట్టింది.

Brijesh tribunal deadline year extension on krishna water disputes