Home తాజా వార్తలు పంది మూత్రపిండాలు మనిషికి…

పంది మూత్రపిండాలు మనిషికి…

లండన్: పంది గుండెలను స్వీకరించి మనుషుల్లో గుండె మార్పిడి చేయవచ్చని బ్రిటన్‌లో గుండె మార్పిడి శస్త్ర చికిత్సల ప్రావీణ్యులు డాక్టర్ టెరెన్స్ వెల్లడించారు. 40 ఏళ్ల క్రితం 1979లో మొట్టమొదటిసారి నిర్వహించిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స అనుభవంతోనే ఈ ఏడాది ఆఖరుకు పంది నుంచి మనిషికి మూత్రపిండాల మార్పిడి చేయనున్నట్టు ప్రకటించారు. ఇది జయప్రదమైతే అనేక అవయవాల మార్పిడికి వీలుకల్పించే వెలుగు బాట అవుతుందని అన్నారు. వీరు తటస్థంగా ఉండే రెండు జన్యువులను అభివృద్ధి చేశారు.

తటస్థ మూత్రపించాలు మనిషికి మార్పిడి చేసే జినోట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఫలితాలు సంతృప్తికరంగా ఉంటే కొన్ని సంవత్సరాల్లో గుండె మార్పిడి సులువవుతుందని చెబుతున్నారు. పంది గుండె ఫిజియోలజీ, అనాటమీ, మానవ గుండెను పోలి ఉంటాయి. అందువల్ల కొత్త చికిత్సకు ఇదో నమూనాగా ఉపయోగపడుతుంది. గుండెలో దెబ్బతిన్న కణాలు తిరిగి ఉత్పత్తి కాడానికి మైక్రో ఆర్‌ఎన్‌ఎ 190 అనే జన్యువును చేరిస్తే మేలు జరుగుతుందని చెప్పారు.

Britain doctor heart transplant from pig to man