Home అంతర్జాతీయ వార్తలు దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ షాక్!

దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ షాక్!

Dawood-Ibrahim

లండన్: అంతర్జాతీయ మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. తాజాగా బ్రిటన్ విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరును చేర్చింది. దీంతో పెద్ద మొత్తంలో దావూద్ ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంది. దావూద్‌కు చెందిన వార్విక్‌షైర్‌లో హోటల్, మిడ్‌ల్యాండ్‌లో నివాస ఆస్తులు జప్తు చేసిన వాటిలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా దావూద్‌పై ఆర్ధిక ఆంక్షలు విధించాలని భారత్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బ్రిటన్ దావూద్ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.