Friday, April 19, 2024

బ్రిటీష్ సామ్రాజ్యవాదం

- Advertisement -
- Advertisement -

భారతీయ శక్తుల సహాయం..

British history in telugu

ఆధునిక భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యాప్తికి దక్షిణాదిలోనే పునాదులు పడ్డాయి.
కర్నాటిక్ రాజ్యానికి పాలకుడైన అన్వరుద్దీన్ ఆంగ్లేయుల చేతిలో కీలు బొమ్మయినాడు.
ఆంగ్లో కర్నాటక, ఫ్రెంచ్ యుద్ధాలలో ఆంగ్లేయులకు మద్దతు పలికాడు.
తొలి దశలో కర్నాటిక్ కేంద్రంగా ఆంగ్లేయులు బలపడ్డారు.
ముఖ్యంగా రాబర్ట్‌క్లైవ్ ఆర్కాట్‌ను ముట్టడించి తన ఆక్రమణలోకి తెచ్చుకోవడంతో కర్నాటిక్ నవాబు పూర్తిగా ఆంగ్లేయులపై ఆధారపడవలసిన పరిస్థితి తలెత్తింది.
దేశంలోనే అతిపెద్ద స్వదేశీ సంస్థానం హైదరాబాద్ నిజాం ప్రభువులు ఆంగ్లేయులకు సహకరించారు.
1766లో నవాబు నిజాం అలీ ఉత్తర సర్కారులు (కోస్తా జిల్లాలను) ఆంగ్లేయులకు బదిలీ చేశాడు.
1798లో లార్డ్ వెల్లస్లీ రూపొందించిన సైన్య సహకార విధానానికి అంగీకరించిన మొట్ట మొదటి పాలకుడైనాడు.
ఆంగ్లేయులకు ప్రధాన శత్రువులైన మైసూర్‌తో జరిగిన యుద్ధాల్లో నవా బు ఆంగ్లేయులకు సహకరించాడు.
వారి సైనిక భారాన్ని బరిస్తూ చివరకు తనకు సంక్రమించిన దత్తమండలాల నూ ఆంగ్లేయులకే సమర్పించాడు.
1857 సిపాయిల తిరుగుబాటును కూడా అణిచివేయుటకు సహకరించారు.
బెంగాల్ ప్రాంతానికి పాలకులైన నవాబులు ఆంగ్లేయులకు సహకారం అందించారు.
నవాబు సిరాజ్ ఉద్దౌలా, మీర్ ఖాసింలను తప్పించి కుట్రతో మీర్జాఫర్ పాలకుడయ్యాడు.
మీర్జాఫర్ ఆంగ్లేయులకు ఎగుమతి, దిగుమతి సుంకాలు లేని స్వేచ్ఛా వ్యాపార హక్కులు కల్పించారు.
దీంతో ఆర్థికంగా ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ బలపడింది.
భారతదేశానికి నామమాత్రపు పాలకుడైన మొఘల్ చక్రవర్తి కూడా పరోక్షంగా ఆంగ్లేయులకు తోడ్పడినాడు.
1765 అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్, బిహార్ ఒరిస్సాలలో భూమి శిస్తు వసూలు చేసుకుని దివాని హక్కును ఆంగ్లేయులకు ప్రసాధించాడు. దీనితో ఆంగ్లేయులు తమ విస్త్రతమైన బెంగాల్ వనరులను సామ్రాజ్యవాద వ్యాప్తికి ఉపయోగించారు.
అత్యంత బలమైన మరాఠ సంకీర్ణ కూటమి కూడా ఆంగ్లేయులకు సహకరించారు.
ఆంగ్లేయులకు ప్రధాన శత్రువైన హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లను ఒడించడంలో మరాఠాలు ఆంగ్లేయులకు సహకరించారు.
మరాఠ కూటమికి అధ్యక్షుడైన పీష్వా స్వయంగా సైన్యసహకార పద్దతికి అంగీకరించి మరాఠ కూటమి దెబ్బతినడానికి కారకుడయ్యాడు.
పంజాబ్‌లో ఆంగ్లేయులను ఎదిరించే సత్తా ఉన్నప్పటికీ రాజా రంజిత్‌సింగ్ కూడా ఆంగ్లేయుల పట్ల స్నేహాన్ని కనబరిచాడు.
సిక్కులు ఆఫ్ఘాన్ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించారు.
పై విధంగా స్వదేశీ శక్తుల సహకారంతో ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు.
స్వదేశీ వైఫల్యానికి కారణాలు..
కర్నాటిక్ నవాబు అన్వరుద్దీన్ ఫ్రెంచివారి భయం వలన ఆంగ్లేయులను చేరదీయవలసి వచ్చింది.
హైదరాబాద్‌లో నవాబు ఆర్థిక సమస్యల వలన ఉత్తర సర్కార్‌లను ఆంగ్లేయులకు బదిలీ చేశాడు.
మరాఠాలు, హైదరలీ నుండి ప్రమాధాన్ని శంకించి ఆంగ్లేయులతో చేతులు కలిపాడు.
ఇక్కడ అభద్రతా భావం నవాబు వైఫల్యానికి ప్రధాన కారణమైంది.
బెంగాల్‌లో కేవలం కుట్రతో ఆంగ్లేయులు సిరాజ్ ఉద్దౌలాను ప్లాసీయుద్ధంలో ఓడించాడు.
కుట్రను గ్రహించకపోవడం సిరాజ్ వైఫల్యానికి కారణమైంది.
మొఘల్ చక్రవర్తి బలహీనత అసమర్ధత అతడి వైఫల్యానికి ప్రధాన కారణమయ్యాయి.
మరాఠాల విషయంలో చివరి పీష్వా అయిన రెండవ బాజీరావు ప్రమాధాన్ని శంకించి సైన్య సహకార పద్దతికి అంగీకరించి మరాఠా కూటమి పతనానికి కారకుడైనాడు.
పంజాబ్‌లో రంజిత్ సింగ్ మరణానంతరం జరిగిన ఆంగ్లో సిక్కు యుద్ధా ల్లో సైనిక నాయకత్వం చేసిన విద్రోహాల వలన ముఖ్యంగా తేజా సింగ్ వలన సిక్కులు ఓటమి పాలయ్యారు.
పై కారణాలే కాక శిక్షణ పొందిన సైన్యాలు లేకపోవడం ఆధునిక ఆయు ధ సంపత్తి లేకపోవడంతో ముఖ్యంగా బ్రిటీష్‌వారి కుట్రలు కుతంత్రాలను గ్రహించలేక పోవడం స్వదేశీ పాలకుల ఓటమికి దారితీసింది.

తిరుగుబాట్లు

19వ శాతాబ్దం ప్రధమార్థం నాటికి భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య వాదం పూర్తయింది.
బ్రిటీష్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో పౌరతిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి. అవి
1. సన్యాసుల తిరుగుబాటు(1772)
బెంగాల్‌లోని గిరి శాఖకు చెందిన సన్యాసులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో వీరు మొట్టమొదటి సారిగా తిరుగుబాటు చేసినవారయ్యారు.
సన్యాసులు దిగంభరంగా పుణ్య క్షేత్రాలను దర్శించడాన్ని నిషేదించడం వలన తిరుగుబాటు తలెత్తింది.
1772 బెంగాల్ కరువు కూడా తిరుగువాటుకు కారణమైంది.
బంకించంద్ర చటర్జీ తన ఆనందమఠ్ నవలలో ఈ తిరుగుబాటును గురించి ప్రస్థావించాడు.
2. ఫరాజి ఉద్యమం:
1805లో పశ్చిమ బెంగాల్ లోని ఫరిద్‌పూర్ జిల్లాలో షరియత్ తుల్లా, హహ్మద్ మోహసిన్ ల ఆధ్వర్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది.
హిందూ భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ముస్లిం వ్యవసాయ కూలీలను సంఘటిత పరిచారు.
చివరికి ఇది హిందూ ముస్లిం మతపరమైన ఘర్షణగా మారింది.
3. వహాబీ ఉద్యమం..
అబ్దుల్ వహబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. భారతదేశంలో తిరిగి ముస్లింల పాలనకు పునరుద్దరించుటకు ఉద్యమం పిలుపు నిచ్చింది.
పంజాబ్‌లో సిక్కులను, భారతదేశంలో ఆంగ్లేయులను వ్యతిరేకించుటకు పూనుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సయ్యద్ అహ్మద్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
ఉద్యమం హిందూ ముస్లిం ఐక్యతను చాటింది.
ఈ ఉద్యమంలో వహాబీలు కీలక పాత్ర పోషించారు.
తిరుగుబాటు విఫలం అవ్వడంతో ఉద్యమం అంతరించింది.
4. కూకా ఉద్యమం..
పంజాబ్‌లో నామ్‌దారీ ఉద్యమం ఒక సంస్కరణ వాద ఉద్యమంగా భగత్ జవహరిమల్ ఆధర్యంలో 1842లో ప్రారంభమైంది.
సిక్కు సమాజంలో తలెత్తిన అసమానతలను వ్యసనమైన తాగుడును ఉద్యమం వ్యతిరేకించింది.
ఈ ఉద్యమం రాంసింగ్ ఆధ్వర్యంలో పంజాబ్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగింది.
ఈ ఉద్యమం భారతదేశంలో బ్రిటీష్ వారిని వ్యతిరేకించే కూకా ఉద్యమంగా మారింది.
కూకాలు గురుగోవింద్‌ను మాత్రమే నిజమైన సిక్కు గురువుగా పరిగణిస్తారు.
1870లో రామ్‌సింగ్ కూడా తిరుగుబాటు నిర్వహించి అమృత్‌సర్‌లో కూకా ప్రభుత్వాన్ని ఏర్పరచినారు.

బ్రిటీష్ ఆధిపత్యానికి కారణాలు

1757 ప్లాసీ యుద్ధం ఆధునిక భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఏర్పడుటకు పునాదులు వేసింది.
ప్లాసీ యుద్ధం మొదటి విప్లవంగా పిలవబడింది.
ఈ యుద్ధంతో వర్తక వాణిజ్యం కొరకు భారతదేశానికి వచ్చిన ఇం గ్లిష్ ఈస్టిండియా కంపెనీ ఒక ప్రాదేశిక శక్తిగా అవతరించింది.
బ్రిటీష్ వారు బలపడటానికి మొదటి కారణం తిరుగులేని నౌకాధిపత్యం కలిగి ఉండటమే.
1760 వందవాసి యుద్ధంలో బ్రిటీష్ వారు తమ నౌకాధిపత్యంతో శత్రువులైన ఫ్రెంచ్ వారిని ఓడించారు.
దీంతో భారతదేశంలో ఏ ఐరోపా దేశం కూడా బ్రిటీష్‌తో పెట్టుకోకుండా తిరుగులేని ఆదిపత్యం సాధించారు.
ఆంగ్లేయులు వ్యూహాత్మకంగా ఏర్పరచుకున్న స్థావరాలు కూడా వారి ఆధిపత్యానికి దారితీశాయి.
దక్షిణాన మద్రాస్ ప్రెసిడెన్సీ, తూర్పున బెంగాల్ ప్రెసిడెన్సీ, పశ్చిమాన బాంబే ప్రెసిడెన్సీలను ఏర్పరచుకొని ఒక ప్రణాళికా బద్ధంగా తమ విస్తరణను సాగించారు.
స్వదేశీ పాలకుల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వీరి ఆధిపత్యానికి ప్రోత్సాహాన్నిచ్చింది.
బ్రిటీష్ వారు తొలిసారిగా కర్నాటక ప్రాంతంలో అన్వరుద్దీన్, చందాసాహెబ్ మధ్య తలెత్తిన వివాదాల్లో జోక్యం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతరయుద్ధంలో నాసర్‌జంగ్‌కు మద్దతు పలికి క్రమంగా నిజాం అలీ కాలంలో ఉత్తర సర్కారును పొందారు.
కుట్రలు కుతంత్రాలు వంటి విధానాలతో కూడిన దౌత్యనీతి వీరి ఆధిపత్యానికి తోడ్పడింది.
బెంగాల్ ఆక్రమణలో రాబర్ట్‌క్లైవ్ కుట్రతో నవాబు సిరాజ్‌ను ప్లాసీ యుద్ధంలో ఓడించాడు.
బ్రిటీష్ వారు అనుసరించిన విధానాలు మూలంగా లార్డ్ వార్న్‌హేస్టింగ్స్ తన కంచవలయ విధానంతో విజయవంతమయ్యాడు.
లార్డ్ వెల్లస్లీ తన సైన్య సహకార విధానంతో భారతదేశంలో అత్యంత బలవంతుడైన మరాఠ కూటమిని నిర్వీర్యం చేశాడు.
లార్డ్ డెల్హౌసీ దత్తసంకరణ విధానం బ్రిటీష సామ్రాజ్య వాదానికి పరాకాష్టగా చెప్పవచ్చు.
ఈ విధానం కింద డల్హౌసి సతార, జైత్‌పూర్, సంబల్‌పూర్ , ఉదయ్‌పూర్ భగత్, ఝాన్సీ, నాగ్‌పూర్ లను ఆక్రమించాడు.
మొఘల్ చక్రవర్తి అసమర్ధత కూడా ఆంగ్లేయుల ఆధిపత్యానికి దారి తీసింది.
1764 బక్సర్ యుద్ధంలో ఓడిపోయిన మొఘల్ చక్రవర్తి షా ఆలం 1765 అలహాబాద్ సంధి ద్వారా ఆంగ్లేయులకు దివానీ హక్కులు అందించాడు.
దీంతో అత్యంత ఐశ్వర్య వంతమైన బెంగాల్ వనరులను తమ సామ్రాజ్యవాదానికి వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News