Home నాగర్ కర్నూల్ ‘కోడ్‌ల’ గుట్టు విప్పండి

‘కోడ్‌ల’ గుట్టు విప్పండి

 దళారీల విస్తరణే కొత్త జిల్లాల లక్షమా?
అవినీతి వైపు యువతను మళ్లింపు
ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలి
విజిలెన్స్ విచారణ జరపాలి

Codes

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌క ర్నూల్ జిల్లా రవాణా కార్యాలయంలో కొనసాగుతున్న తప్పుడు విధానాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల పేరిట ఒక వైపు రోడ్డు నిబంధనలను కఠినతరం చేస్తూ మరో వైపు నిబంధనలు పాటించేందుకు సిద్దం అవుతున్న యువతను అవినీతి పనులతో విసుగు తెప్పించే విధం గా వ్యవహరిస్తున్న తీరును వెంటనే మానుకోవాలని ప లువురు హెచ్చరిస్తున్నారు.రోడ్డు బధ్రతా వారోత్సవా లు,రోడ్డు నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ముందుగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జరుగు తున్న అక్రమాలపై దృష్టిపెట్టాలని ,వారిలో తొలుత త ప్పుడు విధానాలు మానుకునేలా చైతన్యం తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా రవాణా కార్యాలయంలో కొనసాగుతు న్న బ్రోకర్ దందా,బహిరంగ కరప్షన్ పై మనతెలంగా ణలో వస్తున వరుస కథనాలకు పలువురు స్పందించా రు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత వాహనదారులు , లైసె న్స్ దారులు చేసుకున్న దరఖాస్తులలో నేరుగాపనులు చేయించుకున్న వారెందరు, బ్రోకర్ల ద్వారా పనిజ రిగినవి ఎన్ని అన్న విషయం పై విచారణ జరిపించాలని కూడా పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా దరఖాస్తు ఫారాలపై పైభాగంలో కుడివైపు ఓ చివరన వేస్తున్న కోడ్‌ల గుట్టు విప్పాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నా రు. కార్యాలయంలో మంజూరయిన దరఖాస్తులు ఇతర పనులకు సంబందించిన ఫైల్స్‌ను విజిలెన్స్ అధికారులు స్వాదీనం చేసుకోవాలని సమగ్ర విచారణ జరపాలని కూడా పలువురు కోరుతున్నారు.

ఒకపైపు వివిధ కార ణాలతో మోటారు వాహనాల చట్టంకింద భారీగా జరి మానాలు విధిస్తుండగా చట్ట బద్దంగా వ్యవహరిద్దామని ఆశిస్తున్న యువతకు ఇక్కడి రవాణా కార్యాలయం వారు వ్యవహరిస్తున్న తీరు అగ్రహం కల్గిస్తున్నదని ,యువతకు నేరుగా పనికాకపోవడంతో అవినీతివైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడటం అసహనానికి దారితీస్తుందని ఇది ఆందోళన కల్గించే విధానమని ఇక నైనా డిటిఓ కార్యాలయం సక్రమ మార్గంలో నడిచేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు.

అవినీతి రహితం ఉట్టి మాటేనా

అందరు జిల్లా అధికారుల సమక్షంలో ,బహిరంగ వేదికపై జిల్లా రవాణా కార్యాలయం అవినీతి గుట్టు విప్పి రోజులు గడుస్తున్నా ఎలాంటి చ ర్యలు తీసుకోక పోవడం ప్రభుత్వ మొద్దు నిద్రకు నిదర్శనం.అవినీతి రహిత పాలన అన్నది కేవలం డైలాగులే తప్ప ఆచరణలో అమలు కావడం లేదన్నదా నికి ఇది బహిరంగ నిదర్శనం .జిల్లా రవాణా కార్యా లయం ఏజంట్ల కోడ్‌ల విషయంలో విజిలెన్స్ చేత విచారణ జరిపించాలి.వాహ నదారుల దరఖాస్తుల పై వేసిఉన్న కోడ్‌లను డీకోడ్ చేసి బాద్యులపై చర్యలు తీసుకోవాలి.
కొండా మణెమ్మ,

 జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
దళారీలను అరికట్టకపోతే అందోళన

ఉమ్మడి రాష్ట్రం,ఉమ్మడి జిల్లాల్లో ఎంతో అవినీతి ఉండేది .తెలంగాణ వచ్చాక అవినీతి అంతం చేస్తామని,పారదర్శక పాలన,ప్రజలవద్దకు అవినీతిలేని పాలన అంటూ కెసిఆర్ చెప్పారు. జనం నమ్మారు. కాని అవినీతి మరింత ఎక్కువైంది. లైసెన్స్‌లకు వెలితే చిన్నచిన్న కారణాలు చూపించి వెనక్కి పం పుతున్నారు. న్యాయంగా పని జరగక పోవడంవల్లే దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారీ దందా అరికట్టక పోతే బాదితులను తీసుకుని డిటిఒ ముందు ఆందోళన చేస్తాం
ఆర్.శ్రీనివాసులు,
సిపిఎం రాష్ట్రనాయకులు

బహిరంగ అవినీతి కళ్లకు కనిపించదా

అవినీతి జరిగితే ,లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని సిఎం కెసిఆర్ పేరిట సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల హోరు కొనసా గుతుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా లంచాలు లేకుం డా పనిజరగటంలేదు. జిల్లా రవాణా కార్యలయంలో ఇంత బహిరంగంగా కరప్షన్ దందా కొనసాగుతున్నా ప్రభుత్వం ,ఉన్నతాధికారుల దృష్టికి రావడంలేదంటే దీన్ని దృతరాష్ట్ర పాలన అనాలా? ఆలూరి నరెందర్,
కౌన్సిలర్,నాగర్‌కర్నూల్

అవినీతివల్ల యువతలో అసహనం పెరుగుతుంది

రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం లైసె న్స్‌లు,వాహనాల రిజిస్ట్రేషన్ తదితర అంశాల విషయంలో అవినీతికి తావులేకుండా పనులు అయ్యేలా చూడాలి.డిటిఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపిం చాలి. అవినీతి వల్ల ఇబ్బందులు ఎదురవుతే యువతలో అసహ నం పెరిగి దారితప్పేందుకు దారి చూపిన వారవుతారు.
హెచ్ ఆనంద్‌జీ,
సిపిఐ జిల్లా నాయకులు