Home మహబూబ్‌నగర్ దళారులతో రైతులు దగా

దళారులతో రైతులు దగా

మార్కెట్ యార్డు నిర్మించండి
నాగర్‌కర్నూల్ నియెజకవర్గంలో బిజినేపల్లి మండలం చాలా పెద్దదని ఆత్యధికంగా రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని కష్టపడి పండించిన పంటలను ఎక్కడ ఆమ్ముకోవాలో తెలియక ఆమాయక రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి ,మొక్కజొన్న మార్కెట్ యార్డులను నిర్మించాలని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి.
-సుధాపరిమళ, జడ్పిటిసి బిజినేపల్లి
ఆత్మహత్యలే శరణ్యం
దాదాపు 5 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది .దాదాపు లక్ష యాభై వేల దాకా పంట కోసం ఆప్పులు చేశాను. కనీసం వడ్డీకి కుడా డబ్బులు సరిపోవడం లేదు. కొద్దొగొప్పొ పంట ఆమ్ముకుందామన్నా మార్కెట్ యార్డు లేక పోవటంతో దళారుల చేతిలో పంటలు పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం.
– బోనమోని వెంకటయ్య రైతు, ఖానాపూర్

Cottonబిజినేపల్లి: ఆరుగాలం ఎంతో కష్టపడి చమటోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతులు విలవిలాడుతు న్నారు. దీనికి తోడు గ్రామగ్రామాన వెలిసిన దళారుల చేతిలో రైతులు దగాపడుతున్నారు. ఆధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో ఆనుమతులు లేని కాంటాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. బిజినేపల్లి మండలంలో రైతులు ప్రదానంగా పత్తి ,మొక్కజోన్న, మిర్చి, ఆముదం పంటలను విరివిగా సాగు చేస్తుంటారు. పంటలు వేసిన రోజు నుండి రైతులు రాత్రనక పగలనక పంటలను కాపాడుకుంటు పండించుకుంటే ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర లేకపోవడం దానికి తోడు తెచ్చుకున్న ఆప్పులు పెరిగిపోతుండటంతో దీనిని ఆసరాగా చేసుకోని దళారులు రెచ్చిపోతున్నారు. మండలంలో ఆత్యధికంగా రైతులు తెల్లబంగారంగా కొలిచే పత్తి పంటను పండిస్తుంటారు. ఈ ఖరీఫ్‌లో 16 ,500 ఎకరాలకు పైగా పత్తి పంటను సాగు చేశారు. ఈ సారి ఆతివృష్టి వలన చాలా నష్టపోయారు. ఒక ఎకరాకు దాదాపు 20 వేల దాకా ఖర్చులు చేశారు. కాని దిగుబడి మాత్రం పూర్తిగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు మండలంలో ప్రదానంగా మంగనూరు, వెలుగొండ, వట్టెం గ్రామాలకు చెందిన వారితో పాటు మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన కొంత మంది దళారులు వింగులుగా ఏర్పాటు ఆయ్యి పత్తి కొనుగోలు చేస్తు రైతులను మోసం చేస్తున్నారు. వీరికి తోడు గుంటూరు, నంద్యాల నుండి ప్రతి సంవత్సరం మండల కేంద్రానికి కొంత మంది దళారులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే దళారులతో కుమ్మకై కొనుగోలు చేస్తుంటారు. దళారులందరు కుమ్మకైతే వారిది ఆడిందే ఆట పాడిందే పాట గా సాగుతూ 3 పూవ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు. 20 ఎకరాల భూమి ఉన్న రైతు ఆప్పుల ఊబిలో కురుక పోయి వడ్డీ కట్టలేక విలవిలలాడుతుంటే ఆర ఎకరం భూమి కుడా లేని దళారీలు మాత్రం కోట్లకు పడగలెత్తు తున్నారు. దీన్నే బట్టే ఆర్థం ఆవుతుంది రైతు పరిస్థితి. గత సంవత్సరం మంగనూరు గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆదే గ్రామానికి చెందిన దళారీలకు పత్తిని ఆమ్మారు. కానీ ఇక్కడ దళారీలు కోనుగోలు చేసిన దాని కంటే ఆమ్మినప్పుడు దాదాపు 30 క్వింటాళ్లకు పైగా ఆదనంగా రావడం ఈ తేడాను పసిగట్టిన రైతులు దళారులను నిలదీయడం వంటి సంఘటనలు జరిగాయి.
దళారులను అరికట్టాలి
ఒక్క లారీ తోనే ఇంత పెద్ద తేడా రావడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఆధికారులు వెంటనే స్పందించి మో సాలకు పాల్పడుతున్న దళారులను ఆరికట్టాలని కోరుతు న్నారు. ఆంతే కాకుండా దాదాపు 8 వేల ఎకరాలలో మొక్క జోన్న మండలంలో సాగు చేశారు.
రైతుల పోలాల్లోకి నేరు గా వెళ్లి బేర సారాలు చేసి కొనుగోలు చేసుకుంటు దండు కుంటున్నారు. కొందరు దళారులైతే రైతులను లోబర్చుకో వడం కోసం ఆప్పుగా కొంత డబ్బును ముందుగా ఆప్పజే పుతు పంట తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మం డల కేంద్రంలో మార్కెట్ లేక పోవడంతో వేరే మార్కెట్‌కు వెళ్లాలంటే రవాణా ఖర్చు ఎక్కువ ఆవుతుందనే ఉద్దేశ్యంతో చేసేది లేక రైతులు దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే ఆదునుగా చేసుకోని దళారులు రైతులకు లేనిపోని ఆ పోహలుల కల్పిస్తు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువగా ధర చెబుతూ తూకం వద్ద నుండి రైతులను దగా చేస్తున్నారు. గత సంవత్సరం కుడా ఆశించిన దిగుబ డులు రాకపోవడంతో మండలంలో చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత సంవత్సరం మాదిరిగా ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతులకు ధైర్ఘం నింపుతు వారికి గిట్టుబాటు ధర కల్పిస్తు దళారుల చేతిలో మోసపో కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.