Home నాగర్ కర్నూల్ మార్నింగ్ మార్కింగ్ ఈవెనింగ్ కలెక్షన్

మార్నింగ్ మార్కింగ్ ఈవెనింగ్ కలెక్షన్

ఒక్కో ఏజంట్‌కు కోడ్
విచ్చల విడిగా వసూళ్లు
ప్రశ్నిస్తె కొర్రీలు

Broker1

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఫైల్‌పై మార్క్ పడిందా అయితే ఓకే.. లేదా అంతే సంగతులు.. ఇదీ నాగర్‌కర్నూల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో  కొనసాగుతున్న బ్రోకర్ దందా. జిల్లా రవాణా కార్యాలయంలో సర్కారి రుసుంకు తోడు పై పై ఆదాయం నేరుగా తీసుకుని రిస్క్ లో ఎందుకు పడాలి కాగల కార్యం బ్రోకర్లే తీ ర్చనుండగా అనుకున్నారు. కార్యాలయం చు ట్టూ చేరిన దాదాపు 30 మందికి పైగా బ్రోకర్లు ఆన్‌లైన్ పేమెంట్ గాక కార్యాలయం ఆమ్యా మ్యాలు, ఇంతా చేస్తున్నందుకు తమ కూలీ గిట్టించుకునేలా ఒక్కో పనికి ఒక ధర నిర్ణయిం చి వసూలు చేస్తున్నారు. నిత్యం నేరుగా వచ్చే దరఖాస్తులు ,బ్రోకర్ల దరఖాస్తులు కల్సిపోయి అదృష్టం బాగుంటే తమ పని చటుక్కున అయి పోతుందని ఎవరైనా భావిస్తే సిగ్నల్ జంప్ చేసినట్లే .ఎందుకంటే ఏలెక్కకా లెక్కే అన్నట్లు బ్రోకర్ల ద్వారా వెల్లే ధరకాస్తులకు కోడ్ మా ర్కింగ్ ఉంటుందట.

ఒక్కో బ్రోకర్‌కు ఒక్కో సిగ్నల్ ఉంటుంది. సాయంత్రానికి ఏ ఏజంట్ ఎన్ని ఏ రకమైన దరఖాస్తులు తెచ్చారన్నది గు ర్తిస్తారట. దాన్ని బట్టి సదరు ఏజంట్లు ముట్ట చెప్పాల్సిన మొత్తాన్ని లెక్కబెట్టి ఇచ్చేస్తారట ఇ దీ జిల్లా రవాణా కార్యాలయం ముందు పట్ట పగలు సాగుతున్న క(రప్షన్)లెక్షన్ దందా.
ప్రభుత్వ ఫీజుకు డబుల్
ఇటీవల పెంచిన పీజులు కాక పాత ఫీజుల ప్ర కారం డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబందించి రెండు వేలకు పైగా ఒక్కో వాహన దారు వద్ద బ్రోకర్లు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆన్‌లైన్ పే మెంటు , ఇతరత్రా ఫీజులు కలిపి వెయ్యి రూ పాయల దాకా అవుతుంది. ఇందులో లెర్నిం గ్, డ్రైవింగ్ లైసెన్స్‌లు రెండూ ఉంటాయి. అవ సరమైన మెడికల్ సర్టిఫికేట్లు కూడా తెచ్చే బా ధ్యత బ్రోకర్‌దే.

ఇవన్నీ కలిపి రూ.1050 అవు తుంది. మిగతా రూ.950లో ఆఫీసు ఖర్చులు, బ్రోకర్ కమీషన్ ఉంటుంది. ఫిట్ నెస్ వద్ద వా హనాన్ని బట్టి ఆమ్యామ్యాల ధర మారుతుం టుంది. కారునుండి తుఫాన్ వాహనం ,ఇతర పెద్ద వాహనాల ఫిట్‌నెస్ కు కార్యాల యంఖర్చు భారీగానే ఉంటుందని తెల్సింది. ఒక్కో వాహనంకు ఐదొందల నుండి వెయ్యికి పైగా వసూలు చేస్తున్నట్లు తెల్సింది.ఇలారో జు జిల్లా నలుమూలల నుండి వచ్చే వాహనాలు భారీ సంఖ్యలోనే ఉండటంతో డిటిఒ కార్యాల యంకు వచ్చే వాహన దారుల నుండి ప్రభుత్వ ఫీజుకన్నా భారీ మొత్తంలో బ్రోకర్ల ద్వారా వ సూలు అవుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఇవేవీ తన దృష్టికి రాలేదు

తమ కార్యాలయంలో బ్రో కర్ల దందా జరుగు తున్న విషయం తన దృష్టికి రాలే దు. తనకు ఎవ్వరూ ఫి ర్యాదు చేయలేదు. ఒక వేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసు కుంటాం.

సర్దార్ అహ్మద్ డిటిఓ నాగర్‌కర్నూల్