Home తాజా వార్తలు అక్క ఆత్మార్పణానికి దారితీసిన పత్తి రైతు ఆత్మహత్య

అక్క ఆత్మార్పణానికి దారితీసిన పత్తి రైతు ఆత్మహత్య

farmer-sucide

మన తెలంగాణ / నాగార్జునసాగర్
పత్తిరైతు ఆత్మహత్య చేసుకోగా మరణవార్తను జీర్ణించుకోలేక వికలాంగురాలైన అతని సోదరి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకు న్న సంఘటన నల్లగొండ జిల్లా, పెద్దవూర మండ లం చింతలపాలెం గ్రామ పంచాయతీలోని సపావట్‌తండాలో గురువారం చోటుచేసుకున్న ది. తండావాసుల కథనం ప్రకారం మేగావత్ శ్రీనునాయక్ (22) ఆయన భార్య అఖిల పత్తి చేనుకు పురుగులమందు కొట్టడానికి వెళ్లారు. అఖిల పంపులో నీళ్లు పోయడానికి నీళ్లు తెచ్చేం దుకు పక్కనే ఉన్న బోరుబావి వద్దకు వెళ్లింది. భర్త పత్తిచేలో క్రిమిసంహారక మందుతాగి పడి పోయాడు. నీటిబిందెతో వచ్చిన భార్య కేకలు వేయడంతో ఇరుగు పొరుగు రైతులు వచ్చి సాగర్  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే లోపే మృతిచెందాడు. ఈవిష యం తెలిసిన వికలాంగురాలైన ఆయన సోదరి పద్మ(నీల) (24) ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందింది. దీంతో ఒకే ఇంట్లో ఇరువురు మృతిచెం దడంతో ఆతండాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాభావంతో ఏర్పడిన కరువే ఇరువురి ఆత్మహత్యలకు కార ణమయ్యిందని తండావాసులు తెలిపారు. శ్రీనునాయక్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. దీనికి తోడు మరో మూడు ఎకరాలు కౌలుకుతీసుకోని నాలు గు ఎకరాలలో పత్తి,ఎకరంలో మిరపసాగు చేశారు. వర్షాభావప రిస్థితుల్లో చేలు పెరగలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రబారడంతో పాటు మిర ప చేను వాడు ఇచ్చుకోలేదు. దీంతో యలించిన శ్రీను ఆత్మహత్యకు పాల్ప డినట్లు తండావాపులు తెలిపారు.