Home తాజా వార్తలు సన్నిహితంగా ఉందని… చెల్లెలుపై కత్తితో దాడి

సన్నిహితంగా ఉందని… చెల్లెలుపై కత్తితో దాడి

Knife

 

నాగర్ కర్నూల్: చెల్లెలు వివాహేతర సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమెపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా హంక్యతండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేతావత్ చిట్టి అనే అమ్మాయి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. అనంతరం ఆదే గ్రామానికి చెందిన ఆర్‌టిసి డ్రైవర్‌తో ప్రేమలో పడింది. అనంతరం వారి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం వాళ్ల వివాహేతర సంబంధం బయటపడడంతో గ్రామ పెద్దలు డ్రైవర్‌కు లక్ష రూపాయలు, ఎకరం భూమి ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. చిట్టితో డ్రైవర్ సన్నిహితంగా ఉన్నప్పుడు చిట్టి అన్నయ్య గమనించాడు. వెంటనే కత్తితో డ్రైవర్‌పై దాడి చేయబోయాడు. డ్రైవర తప్పించుకోవడంతో చెల్లెలుపై దాడి చేశాడు. గ్రామస్థులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.