Home కామారెడ్డి ఆస్తి కోసం అన్నహత్య..

ఆస్తి కోసం అన్నహత్య..

MURDER

రామారెడ్డి(ఎల్లారెడ్డి): ఆస్తి తగాదాల కారణంగా జరిగిన దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రామారెడ్డి మండలం లోని  ఘన్‌పూర్ తండాలో బుధవారం జరిగింది. ఎస్సై వినయ్‌కుమార్‌  తెలిపిన సమాచారం ప్రకారం.. ఘన్‌పూర్  తండాకు చెందిన కార్యకు ఇద్దరు కొడుకులు లక్ష్మణ్‌(48), రాము, ఇద్దరు కుతుళ్లు కళావతి, లీలావతి పెద్ద కొడుకైన లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే, వాళ్లకున్న 6ఏకరాల భూమిపై కొన్నిరోజులుగా వివాదం జరుగుతుంది. తమకు ఆస్తి పంపకాలు చేయాలని సోదరుడితో పాటు కళావతి అన్న లక్ష్మణ్‌తో తరుచు గొడవ పడుతున్నారు. ఇంట్లో పండగకి తల్లిగారింటికి వచ్చిన కళావతి తనకూ భూమిలో వాటా పంచివ్వాలని పట్టుబట్టింది. ఈ తరుణంలోనే బుధవారం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే లక్ష్మణ్‌పై రాము, కళావతితో పాటు తల్లి కార్య దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ను కామారెడ్డి దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిని పోలీసులు విచారణ చేపట్టారు.