Saturday, July 19, 2025

ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి అరెస్టు, బెయిల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వరంగల్ క్రైమ్/హైదరాబాద్: క్వారీ యజమానిని బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసిన కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశి క్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్‌రెడ్డి అరెస్టు, రిమాండ్, బెయిల్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని పోలీసులు క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశా రు. హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో గత నెలలో స్టేషన్ ఘనపుర్ మాజీ ఎంపిపి కట్ట మనోజ్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎంఎల్‌ఎపై బెదిరింపులు, మోసం తదితర సెక్షన్‌ల కేసులు నమోదయ్యాయి. కమలాపూర్ ప్రాంతంలోని తన క్వారీ నడవనీయకుండా అ డ్డుకొని, తనను బెదిరించి కౌశిక్‌రెడ్డి రూ.50 లక్షలు అడిగాడని, అతని బెదిరింపులకు భయపడి రూ.25 లక్షలు ఇచ్చినా మరో రూ.25 లక్షలు అడగడంతో తాను కేసు పెట్టినట్లు మనోజ్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ కేసు కొట్టివేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ ముందుకు సాగాలని ఆదేశిస్తూ ఎంఎల్‌ఎ వేసిన కేసును హైకోర్టు కొద్దిరోజుల క్రితం కొట్టివేసింది. ఈ క్రమంలో దుబాయ్ వెళుతున్న పాడి కౌశిక్ రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకొని హనుమకొండకు తీసుకొని వచ్చారు. సుబేదారి పోలీస్ట్టేషన్లో ఉదయం నుం చి ఉంచి, మధ్యాహ్నం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. సుబేదారి సిఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు న్యా యమూర్తి ఎదుట ఎంఎల్‌ఎను హాజరుపరచి రిమాం డ్ రిపోర్టు దాఖలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాదులు సహోదర రెడ్డి, వద్దిరాజు గణేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుం చి కొందరు న్యాయవాదులు కూడా వచ్చారు. ము ద్దాయి తరపున బెయిల్ పిటిషన్‌పై న్యాయవాదుల వాదనలు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించి కౌశిక్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు.

ఈ సందర్భంగా పోలీసులు ఎంఎల్‌ను ఖమ్మం జైలుకు తరలించేందుకు ఏర్పాటు చేశారు. అప్పటికే బిఆర్‌ఎస్ శ్రేణులు కాజీపేటలో రైల్వే కోర్టు ఆవరణకు పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు చేశారు. ఈలోగా న్యాయవాదులు కౌశిక్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ కోర్టులో సమర్పించారు. ప్రాసిక్యూషన్ విభాగం తరపున, కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు విన్న అనంతరం కాజీపేట రైల్వే కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపు విరామం తర్వాత బెయిల్ ఇస్తున్నట్లు ఆదేశాలు వెలువరించారు. కౌశిక్ రెడ్డిని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పా రు. అంతకుముందు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిని ఉంచిన సందర్భంగా బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున చేరుకొని అతనితో మాట్లాడడానికి విశ్వప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు అందుకు అం గీకరించక పోవడంతో పోలీసులతో బిఆర్‌ఎస్ శ్రేణు లు వాగ్వాదానికి దిగారు. కక్షపూరితంగానే కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News