Friday, April 26, 2024

గాంధారిలో బిఆర్ఎస్ ఆత్మీయ సమేళనం

- Advertisement -
- Advertisement -

గాంధారి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెడ్డి నియోజకవవర్గంలోని గాంధారి మండలంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అభివృద్ది పనుల ప్రారంభం, బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమేళనం కార్యక్రమానకి ముఖ్య అథితిగా పాల్గొన్న మంత్రి వేముల కు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురెందర్, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ స్థానిక నాయకులతో కలసి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి బాన్సువాడ నుండి ఉప్పల్‌వాయి బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాన చేసారు. మండల కేంద్రంలోని సీసీ రోడ్లను ప్రారంభించారు. మేడిపల్లి వద్ద బాన్సువాడ,ఉప్పల్‌వాయి బీటి రోడ్డుకు భూమి పూజ చేసారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పార్టీకి పట్టుకొమ్మలైన కార్యకర్తలు పార్టీని అభివృద్దిపథంలో నడిపించడానికి మరింత కృషి చేయాలని అన్నారు.

ప్రతి కార్యకర్త ఉత్సాహంతో పని చేస్తు రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్, జెడ్పి చైర్మన్ శోభ రాజు, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు ముజీబుద్దీన్, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మాజి మంత్రి ఆంజనేయులు, జెడ్పిటిసీ శంకర్ నాయక్, ఎంపిపి రాధా బలరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యంరావు, సొసైటీ చైర్మన్ సాయికుమార్, సర్పంచ్ సంజీవులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News