Home జోగులాంబ గద్వాల్ విఆర్ఎ దారుణ హత్య…

విఆర్ఎ దారుణ హత్య…

murder

 

గద్వాల : విఆర్ఎ కొలువు కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. అందురు చూస్తుండగానే ఆంజనేయస్వామి సాక్షిగా పట్టపగలే విఆర్ఎ రాజు (30) దాయాది చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది.

ఈసంఘటనకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ప్రత్యేక సాక్షుల కథనం మేరకు వివరాలిలా…. ర్యాలంపాడు గ్రామానికి చెందిన చాకలి తాయన్న గతంలో తలారిగా విధులు నిర్వహిస్తుండేవాడు. అయితే ఇటీవల ఆయన మృతి చెందాడంతో ఆయన కుమారుడు చాకలి రాజుకు విఆర్ఎగా ఉద్యోగం ఇచ్చారు. కానీ తాయన్న సోదరుడి కుమారుడు చాకలి వెంకటన్న ఉద్యోగంలో తమకి కూడ హక్కు ఉందని, ఒక్కరికి విఆర్ఎ ఉద్యోగం ఎలా ఇస్తారంటూ తరచు ఘర్షణకు దిగేవాడు. దీనిని మనస్సులో పెట్టుకుని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైన రాజును అంతమొదించాలనే ఉద్ధేశ్యంతో అతని కోసం వేచి చూస్తు వచ్చాడు.

ఈక్రమంలో మంగళవారం ఉదయం రాజు ద్విచక్ర వాహనంపై గ్రామానికి చేరుకోగానే చంపేందుకు సమాయత్తమయ్యాడు. ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర వేట కొడవళ్లితో నరకడంతో అక్కడిక్కడే రాజు మృతి చెంది తల, మొండెం వేరు వేరుగా పడ్డాయి. ఈహఠాత్తు పరిమాణంతో అక్కడే ఉన్న పెన్షన్ దారులు కంగుతిని చెల్లాచెదురుయ్యారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Brutal murder for Job