Home జాతీయ వార్తలు నడి రోడ్డుపై దారుణ హత్య (వీడియో వైరల్)

నడి రోడ్డుపై దారుణ హత్య (వీడియో వైరల్)

తిరువనంతపురం: ఓ వ్యక్తిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన కేరళలోని ఎర్నాకుళం ప్రాంతం అథానీలో చోటుచేసుకుంది. ఈ హత్య దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వినయ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడు కిందపడగానే కత్తులతో నరికి చంపారు. స్థానికులు చూస్తున్నారే తప్ప ఎవరు ఆపడం లేదు. వినయ్ మృతి చెందాడని నిర్దారించుకున్న తరువాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని వెల్లడించారు. వినయ్ పై గతంలో క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.

Courtesy by Times now 

 

 

Brutal Murder in Ernakulam caught on a CCTV,A three member gang hacking a young man in front of a beverage shop, entire incident was recorded on CCTV.