Home తాజా వార్తలు మియాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

మియాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

Brutal murder

 

వేర్వేరు ప్రదేశాల్లో తల, మొండెం లభ్యం

మియాపూర్ : ఆటోడ్రైవర్‌ను హత్యచేసి తల బొల్లారం చౌరస్తాలోను, మొండెం మియాపూర్ పరిధిలోని ధర్మపురి క్షేత్రం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా గూడుర్ మండలం తీగలపాలెం గ్రామానికి చెందిన గడ్డం ప్రవీణ్ (25) అమిన్‌పూర్ పరిధిలోని శ్రీవాణినగర్‌లో నివాసముంటూ బొల్లారం నుండి గండిమైసమ్మ వరకు రోజూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి స్నేహితుడు శ్రీకాంత్, అతని బావమరిది శ్రీనివాస్ యాదవ్ మియాపూర్ పరిధిలోని ఎంఏ నగర్‌లో నివాసముంటూ ఆటో నడుపుతూ ఫైనాన్స్ ఇస్తుంటారు.

పాత కక్షల నేపథ్యంలో ప్రవీణ్‌ను గురువారం రాత్రి మద్యం సేవించడానికి పిలిచి, ముందుగానే పన్నిన పన్నాగం ప్రకారం రాజేష్ అనే వ్యక్తి తమ ఫైనాన్స్ కింద కొంత డబ్బు తీసుకున్నారని శ్రీకాంత్, శ్రీనివాష్‌యాదవ్ ప్రవీణ్‌కు తెలిపారు. అతన్ని కొట్ట్టడానికని చెప్పి ప్రవీణ్‌ను, రాజేష్‌ను మియాపూర్ పరిధిలోని ధర్మపురి క్షేత్రం పరిసర ప్రాంతానికి తీసుకెళ్లారు. నిందితులు రాజేష్‌ను పట్టుకున్నట్లు నటించి వెంటనే మృతుడు ప్రవీణ్ మెడను చున్నితో గట్టిగా కట్టి దారుణంగా కత్తితో మెడను నరికి చంపారు. అక్కడే ఉన్న రాజేష్ భయంతో పారిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి మొండెన్ని సేకరించారు. ఇదే క్రమంలో తెల్లవారుజామున వ్యక్తి తల మియాపూర్‌లోని బొల్లారం చౌరాస్తలో పడి ఉందని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కాల్ మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఉన్నా తలను ప్రవీణ్ తలగా భావించి తలను మొండెన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హంతకులు పరారీలో ఉన్నటు,్ల వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Brutal murder in Miyapur