Friday, July 19, 2024

వారాసిగూడలో బాలిక దారుణహత్య…

- Advertisement -
died
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారసిగూడాలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను దుండగులు దారుణంగా హత్యచేశారు. బాలిక ఉంటున్న ఇంటిపై రక్తపు మరకలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
brutal murder of the girl at At Warasiguda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News