Home తాజా వార్తలు దుండగుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

దుండగుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

Brutal murdered

 

వలిగొండ : యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామానికి చెందిన బోయిన శంకరయ్య(60) గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. గ్రామస్థులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకరయ్య వృత్తి రీత్యా ఒగ్గు కళాకారుడు. శుక్రవారం సంగెం గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు మెడ, చెవులు కోసి దారుణంగా హత్య చేశారు.

గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డిసిపి నారాయణరెడ్డి, ఎసిపి సత్తయ్య, ఎస్‌ఐ శివనాగప్రసాద్, పోలీసు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియలేవని, అన్ని కోణాల్లో విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని డిసిపి నారాయణరెడ్డి తెలిపారు.

Brutal murdered of man by thugs