Thursday, March 28, 2024

కుప్పకూలాయ్

- Advertisement -
- Advertisement -
Sensex
నిరాశపర్చిన బడ్జెట్

వెల్లువెత్తిన అమ్మకాలు
1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
నిఫ్టీ 300 పాయింట్లు పతనం
ఊతమిచ్చే ప్రకటనలు లేకపోవడమే కారణం: నిపుణులు

ముంబై: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 మార్కెట్లకు రుచించలేదు. ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించిన శనివారం రోజు మార్కెట్లు ఆఖరి సమయంలో ఒక్కసారి కుప్పకూలాయి. తొలుత సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదివే సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. అయితే ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3 శాతం నుంచి 3.8 శాతానికి సవరించడం, కీలక రంగాలకు ఎలాంటి ప్రోత్సాహకర ప్రకటన లేకపోవడం, ఆదాయం పన్ను విషయంలో కోత్త విధానం తేవడం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు నిరాశ చెందారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్ ముగిసే సమయంలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి.

సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఆఖరికి సెన్సెక్స్ 987.96 పాయింట్లు కోల్పోయి 39,735.53 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 300.25 పాయింట్లు తగ్గి 11661.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ శుక్రవారం 40,723 వద్ద, నిఫ్టీ 11,962 వద్ద ముగిశాయి. ప్రారంభ ట్రేడింగ్ సెన్సెక్స్ 279 పాయింట్లు తగ్గింది. ఓ దశలో ఇది 182 పాయింట్లు పెరిగి 40,905.78 వద్దకు చేరుకుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా 55 పాయింట్ల పెరిగి 12,017.35 గరిష్ట స్థాయిని చూసింది. అయితే ఆఖరికి డీలాపడ్డాయి.

రంగాల వారీగా..

రంగాల వారీగా సూచీలను చూస్తే ఐటి, మీడియా, మెటల్, పిఎస్‌యు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు నష్టాలను చవిచూశాయి. ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, రియాల్టీ లాభాలతో ముగిశాయి.

ప్రధాన స్టాక్స్ ఇలా

ఐటిసి 6.76 శాతం, టాటా మోటార్స్ 6.34 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 6.30 శాతం, ఎల్ అండ్ టి 6.04 శాతం, జీ ఎంటర్‌టైన్మెంట్ 6 శాతం పడిపోయాయి. మరోవైపు టిసిఎస్ 4.25 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 1.95 శాతం, నెస్లే ఇండియా 1.70 శాతం, టెక్ మహీంద్రా 1.31 శాతం, విప్రో 0.15 శాతం పెరిగాయి.

మార్కెట్లు సాగాయి ఇలా…

ఉదయం 10:02 గంటలకు మార్కెట్ ఫ్లాట్ ట్రేడయింది. సెన్సెక్స్ 34.44 పాయింట్లు లేదా 0.08 శాతం లాభపడిన తరువాత 40,757.93 స్థాయిలలో ట్రేడయింది. అదే సమయంలో నిఫ్టీ 0.05 పాయింట్లు సాధించిన తరువాత 11,962.05 స్థాయిలలో ట్రేడయింది.
ఉదయం 10:56 గంటలకు మార్కెట్ నష్టాలతో ఉంది. సెన్సెక్స్ 141.01 పాయింట్లు లేదా 0.35 శాతం పెరిగి 40,864.50 వద్ద ట్రేడయింది.
ఉదయం 11:12 గంటలకు నిఫ్టీ 12,000 పైన చేరుకుంది. 137.29 పాయింట్లు లేదా 0.34 శాతం లాభపడిన తర్వాత సెన్సెక్స్ 40,860.78 స్థాయిలలో ట్రేడయింది.
ఉదయం 11:41 గంటలకు సెన్సెక్స్ 33.37 పాయింట్లు లేదా 0.08 శాతం లాభం పొందిన తరువాత 40,756.86 స్థాయిలో ట్రేడయింది.
ఉదయం 11:53 గంటలకు సెన్సెక్స్ 52.75 పాయింట్లు పెరిగింది
మధ్యాహ్నం 12:19 గంటలకు సెన్సెక్స్ 87.02 పాయింట్లు పడిపోయి 40,636.47 స్థాయిలో ట్రేడవుతోంది.
మధ్యాహ్నం 12:32 గంటలకు మార్కెట్ స్వల్పంగా క్షీణించింది.
మధ్యాహ్నం 12:57 గంటలకు సెన్సెక్స్ 159.09 పాయింట్లు లేదా 0.39 శాతం తగ్గి 40,564.40 వద్ద ట్రేడయింది.
మధ్యాహ్నం 1:19 గంటలకు సెన్సెక్స్ 290.19 పాయింట్లు లేదా 0.71 శాతం కోల్పోయి 40,433 స్థాయిలలో ట్రేడయింది.
మధ్యాహ్నం 1:32 గంటలకు మార్కెట్ భారీగా పడిపోయింది. సెన్సెక్స్ 571.19 పాయింట్లు లేదా 1.40 శాతం తగ్గి 40,151.30 స్థాయిలో ట్రేడయింది. నిఫ్టీ 207.20 పాయింట్లు పడిపోయి 11,754 స్థాయిలలో ట్రేడయంది.
మధ్యాహ్నం 3 గంటలకు సెన్సెక్స్ 39,836 పాయింట్లకు పడిపోయింది.
మధ్యాహ్నం 3.30 గంటలకు సెన్సెక్స్ 987.96 పాయింట్లు అంటే 2.43 శాతం నష్టపోయి 39,735 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 373.95 పాయింట్లు అంటే 3.11 శాతం నష్టపోయి 11,661.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఆరింటిలో 4 బడ్జెట్లకు నష్టాలు..

గత సంవత్సరం ప్రభుత్వం సూపర్ రిచ్‌పై సర్‌చార్జిని పెంచింది. తరువాత ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. బడ్జెట్ రోజున ప్రకటనలు సెక్టార్- నిర్దిష్ట కంపెనీల స్టాక్స్‌పై ప్రభావం చూపుతాయి. మోడీ ప్రభుత్వం చివరి 6 పూర్తి బడ్జెట్లను చూస్తే, బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ 4 సార్లు నష్టపోయింది. గతేడాది జూలై 5న బడ్జెట్‌ను సమర్పించారు. సెన్సెక్స్ ఆ రోజు 1 శాతం, నిఫ్టీ 1.14 శాతం కోల్పోయింది. సూపర్ రిచ్‌లపై సర్‌చార్జి పెంచనున్నట్లు గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. విదేశీ పెట్టుబడిదారులను కూడా దాని పరిధిలోకి తీసుకున్నారు. ఇది మార్కెట్ క్షీణతకు దారితీసింది. అయితే కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం సర్‌చార్జి పెంపును ఉపసంహరించుకుంది.

BSE Sensex Down By 1000 Points

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News