Home జాతీయ వార్తలు భారత్‌లోకి చొరబడిన చైనా జాతీయుడి అరెస్ట్

భారత్‌లోకి చొరబడిన చైనా జాతీయుడి అరెస్ట్

BSF apprehends chinese man along India-bangladesh border

 

కోల్‌కత: భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారత భూభాగంలోని పశ్చిమ బెంగాల్‌లో గురువారం ఒక చైనా జాతీయుడిని బిఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సరిహద్దులను దాటుకుని మాల్డా జిల్లాలోకి అక్రమంగా చొరబడిన ఒక 35 ఏళ్ల చైనా జాతీయుడిని బిఎస్‌ఎఫ్ జవాన్లు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జున్వే హన్ అనే పేరు మీద బంగ్లాదేశీ వీసా ఉన్న ఒక చైనీస్ పాస్‌పోర్టును, ఒక టాప్‌టాప్‌ను, మూడు మొబైల్ ఫోన్లను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు బిఎస్‌ఎఫ్ ప్రతినిధి ఢిల్లాలో తెలిపారు. కాలిచక్ పోస్టు వద్ద అతడిని బందీగా ఉంచినట్లు ఆయన చెప్పారు. సంబంధిత సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.

BSF apprehends chinese man along India-bangladesh border