Home తాజా వార్తలు అమిత్‌ షా పర్యటనలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరసన

అమిత్‌ షా పర్యటనలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరసన

BSNL Employees Protest During Amit Shah's Tourహైదరాబాద్‌ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా పర్యటనలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరసన తెలిపారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరన చేయడం దారుణమని వారు తమ నిరసన వ్యక్తం చేశారు. వారాసిగూడ లో సేవ్ బిఎస్ఎన్ఎల్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు. వారు రోడ్లపై, అపార్ట్ మెంట్ల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని తక్షణమే ఆపాలని వారు అమిత్ షాను డిమాండ్ చేశారు.