Home బిజినెస్ 49కే బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్

49కే బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్

పథకం మార్చి 31 వరకు పొడగింపు
bsnlహైదరాబాద్: కొత్త ల్యాండ్ లై న్ వినియోగదారులను ప్రొత్సహించే దిశగా బిఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశ పెట్టిన రూ.49కే ల్యాండ్ లైన్ కనెక్షన్ (ఎక్స్‌పీరియన్స్ ఎల్ ఎల్ 49 ప్లాన్ ) ఈ ఏడాది మార్చి 31 వరకు పొడగించినట్లు బిఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ సర్కిల్ సిజిఎం ఎల్. అనంతరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ల్యాండ్ లైన్ ప్లాన్‌తో వినియోగదారులు సిమ్ ఉచితంగా లభించడమే కాకుండా ఇన్‌స్టాలేష న్‌కు కూడా చార్జీలు వసూలు చేయరు. పైగా రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు, ఆదివారాల్లో అయితే అన్ని నెట్ వర్క్‌లకు రోజంతా ఉచిత కాలింగ్ సదుపాయం ఉంటుం దని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు టోల్ ఫ్రీ నంబర్ 18003451500 లో తెలుసుకోవచ్చని అనంతరామ్ సూచించారు.