Home తాజా వార్తలు బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లో 92,700 విఆర్‌ఎస్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లో 92,700 విఆర్‌ఎస్‌లు

BSNL

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు బిఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్‌లు ఇచ్చిన స్వచ్ఛంద విరమణ పథకానికి(విఆర్‌ఎస్‌కు) దాదాపు 92,685 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 4న ప్రారంభించిన ఈ స్కీమ్ డిసెంబర్ 3న ముగియనుంది. అక్టోబర్ 24న కేబినెట్ అనుమతి ఇచ్చిన తర్వాత కంపెనీల పోర్టల్ ద్వారా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా టెలికాం సేవలందించే బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఎంటిఎన్‌ఎల్(ఇది ముంబై, న్యూఢిల్లీలలో సేవలందిస్తుంది) విలీనానికి కేబినెట్ కూడా అనుమతి ఇచ్చింది.

మొత్తం 16,370 మంది ఉద్యోగులు విఆర్‌ఎస్‌కు అర్హత ఉండగా, వీరిలో 14,383 మంది ఉద్యోగులను స్కీమ్ కు ఖరారు చేశామని, వారు 2020 జనవరి 31న పదవీవిరమణ చేస్తారని ఎంటిఎన్‌ఎల్ అధికారి తెలిపారు. మంగళవారం సాయంత్రానికి బిఎస్‌ఎన్‌ఎల్‌లో 78,300 మంది విఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంస్థ బుధవారం నాడు సరిగ్గా ఎందరు దరఖాస్తు చేశారో చెప్పనుంది.

BSNL to close VRS window