Home తాజా వార్తలు బిటి రోడ్ల పునరుద్ధరణ : జూపల్లి

బిటి రోడ్ల పునరుద్ధరణ : జూపల్లి

Jupally

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని బిటి రోడ్లను పునరుద్ధరిస్తున్నట్టు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో రోడ్ల ఎంతటి దుస్థితిలో ఉన్నాయో తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. బంగారు తెలంగాణ ఏర్పాటులో భాగంగా అన్ని గ్రామాలు, ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేశామని ఆయన చెప్పారు. పాలసీ ప్రకారం రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 14,980 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.2,246 కోట్లు మంజూరు చేశామని ఆయన చెప్పారు. రోడ్ల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1700 కోట్లు ఖర్చు చేసినట్టు ఆయన వెల్లడించారు.

BT Roads Renovation : Jupally