Home రాష్ట్ర వార్తలు దా‘రుణం’

దా‘రుణం’

  • నాలుగేళ్ళలో రూ.1.40 లక్షల కోట్లకు చేరనున్న అప్పు
  • హద్దులు మీరిన పద్దులతో బడ్జెట్ అంకెల గారడీ : ఉత్తమ్‌కుమార్

telangana

హైదరాబాద్: బడ్జెట్ పద్దుల విషయంలో కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నట్లుగా ఉందని, బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమ ర్శించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తు కు, ప్రజలకు మంచిది కాదన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.69వేల కోట్లుగా ఉన్న అప్పులు, నాలుగేళ్ళలో మరో రూ.70 వేల కోట్లు పెరిగి, 2018 మార్చి నాటికి రూ. 1.40 లక్షల కోట్లకు చేరనుండడం శ్రేయస్కరం కాద న్నారు. శాసనసభలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రవేశ పెట్టిన ద్రవ్య వినిమయ బిల్లు లపై ఉత్తమ్ చర్చను ప్రారంభిం చారు. వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వ పూచీకత్తుతో తీసు కునే అప్పు రూ.16,707 కోట్ల నుంచి 2017 జనవరి వరకు ఏకంగా రూ. 31వేల కోట్లకు చేరడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పంటలకు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కర్నాటక తరహాలో బోనస్ ప్రకటించాలన్నారు. మార్కెట్ ధరల స్థిరీకరణ కు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వాటర్‌గ్రిడ్, నీటిపారుల రంగానికి సంబధించిన టెండర్లలో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిపై విచారణకు శాసనసభా సంఘాన్ని వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన 2016 ఏప్రిల్ కు చెందిన ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను ఇప్పటి వరకు రైతులకు అందజేయలేదని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను నియంత్రించ డంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం రైతుల ఆత్య హత్యలలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉన్నది, మహిళా రైతుల విష యంలో మొదటి స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. దళిత, గిరిజనులకు భూ పంపిణీ చేయకుండా భూమి లేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 1989-2014 వరకు ఆ నాటి ప్రభుత్వాలు 5. 75లక్షల పేద కుటుంబాలకు 17.48 లక్షల ఎకరాల భూపంపిణీ చేస్తే, ఇందులో 2 లక్షల మంది దళిత కు టుంబాలు ఉన్నాయని తెలిపారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఐటిలో దేశంలోనే కర్నాటక మొదటి స్థానంలో ఉం టే, మనం నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగా నికి అదనంగా రూ.100కోట్లు కేటాయించాలన్నారు.
‘దుప్పుల’ వెనుక మంత్రుల కుమారులు
మహాదేవ్‌పూర్ ఘటన కేసులో మంత్రుల కుమారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నా యని, దీనిపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతులను అణచివేయడం మంచిదికాదని, ఇందిపా ర్కు ధర్నాచౌక్‌ను తరలించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఖర్చులకు, కేటాయింపులకు తేడా : లక్ష్మణ్
బడ్జెట్‌లో కేటాయింపులకు, వాటి ఖర్చులకు వ్యత్యాసం ఉందని, ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వం ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయని బిజెపి సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. 2016-17లో కేంద్ర ప్రభుత్వ నిధులను రూ. 28వేల కోట్లు ఉండగా, 2017-18లో దానిని రూ.43,862 కోట్లకు పెంచారని, పైగా కేంద్ర నిధులు నామమాత్రంగానే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా 12 శాతం రిజ ర్వేషన్ కల్పిస్తామంటున్న ప్రభుత్వం, రాష్ట్రలోని బిసి రిజర్వేషన్ల పెంపుపై ఎందు కు నోరు విప్పడం లేదన్నారు. భారీ ప్రాజెక్ట్ టెండర్లపైఅనేక ఆరోపణలు ఉన్నా యని, వీటిపై సభ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ ముఠాను అరికట్టండి అక్బరుద్దీన్
హైదరాబాద్‌లో పెరుగుతున్న డ్రగ్స్ ముఠాను అరికట్టాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో పబ్స్, క్లబ్స్‌లలో డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయన్నారు. నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో మూడు గంటల పాటు విద్యుత్ కోతలను విధిస్తోందని విమర్శించా రు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఇంకా ఎపిలో పనిచేస్తున్నారని, అక్కడి వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారి విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
టిడిపి సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కల్లును ప్రొత్సహిస్తూ మద్యాన్ని క్రమే ణా తగ్గించాలన్నారు. గొర్రెలు, మేకల తరహాలోనే గతంలో పశుక్రాంతి పథకం ద్వారా అందించినట్టుగానే ఆవులు, బర్రెలను కూడా పంపిణీ చేయాలని కోరారు. బిసి కార్పొరేషన్‌కు కూడా నిధులను కేటాయించాలన్నారు. సిపిఐ(ఎం)సున్నం రాజయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. కార్మి క సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.టిఆర్‌ఎస్ సభ్యులు ఎం.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది పేదల బడ్జెట్ అని, గతంలో నెలవిడిచి సాము చేసేవారని, ఇప్పుడు వాస్తవ దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించారని అన్నారు.