Home తాజా వార్తలు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యభిచారులు: బూడిద

కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యభిచారులు: బూడిద

Budida Bikshamaiah

 

హైదరాబాద్: తన జీవితంలో ఇది చారిత్రాత్మకమైన రోజు అని మాజీ కాంగ్రెస్ నేత భిక్షమయ్య గౌడ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆలేరు మాజీ ఎంఎల్‌ఎ బూడిద భిక్షమయ్య గౌడ్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్ మాట్లాడారు. నమ్ముకున్న వాళ్లను మోసం చేయడమే కోమటి రెడ్డి బ్రదర్స్ లక్షణమని మండిపడ్డారు. వంద అబద్ధాలకు నిర్వచనం కోమటి రెడ్డి బ్రదర్స్ అని దుయ్యబట్టారు. కోమటి రెడ్డి బ్రదర్స్ పూటకో మాట మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ నీచ, నికృష్ణ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కెటిఆర్ నాయకత్వం వైపు యావత్ తెలంగాణ చూస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపి బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. 

 

Budida Bikshamaiah Comments on Komati Reddy Brother’s