Friday, April 26, 2024

ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్

- Advertisement -
- Advertisement -

TS B Pass

 

పైసా లంచం లేకుండా 21రోజుల్లో ఇంటి నిర్మాణ అనుమతులు

బిపాస్, మీ సేవ, కొత్త యాప్ ద్వారా అధికారులను కలుసుకోనక్కరలేకుండానే పర్మిషన్ పొందవచ్చు

కొత్త మున్సిపల్ చట్టంలో విప్లవాత్మక నిబంధనలు n అధికారులు చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి n నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం n కలెక్టర్లకు మున్సిపల్ పరిపాలనపై అధికారాలిస్తున్నాం n 75 గజాల లోపు స్థలంలో నిర్మాణానికి అనుమతి అక్కరలేదు n మంచి రోడ్లు, మౌలిక సౌకర్యాలు కల్పించాలి n అక్రమ లేఅవుట్లను అరికట్టాలి, క్రమబద్ధీకరించాలి n వ్యవస్థీకృత పట్టణాలను ప్రజలు కోరుకుంటున్నారు మానవ వనరుల అభివృద్ధి కేంద్రం సదస్సులో కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లను ఉద్ధేశించి మంత్రి కెటిఆర్

హైదరాబాద్: వచ్చే ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టిఎస్…బిపాస్ విధానాన్ని అమలు చేయనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. బిపాస్, మీ సేవాతో పాటు కొత్తగా మరో యాప్‌ను తీసుకొసున్నామన్నారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా మున్సిపల్ అధికారులను కలవకుండానే ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పైసా లంచం ఇవ్వకుండా భవన యజమానులకు నిర్ణిత వ్యవధిలో ఇళ్ళ అనుమతులు మంజూరు చేయాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు.21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఈ చట్టాన్ని పూర్తిగా సంబంధిత అధికారులు పూర్తిగా అవగాహన చేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు.

శుక్రవారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో జరిగిన కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు మున్సిపల్ చట్టం, పట్టణ ప్రగతిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2 నుంచి టిఎస్ బిపాస్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో మార్చి నెలలోనే అందులోని లోటుపాట్లను పరిశీలించాలని సూచించారు. టిఎస్..బిపాస్‌పై అన్ని స్థాయిల అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని వివరించారు. ప్రజల పట్ల అధికారులు నిజాయితీగా నడుచుకోవాలన్నారు. మున్సిపల్ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. పనిచేయని ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పల్లె ప్రగతి విజయవంతమైన నేపథ్యంలో ఇక పట్టణ ప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సైతం విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు.

ఇందుకోసం మరో నాలుగైదు రోజుల్లో వార్డు కమిటీలను చేయాలని తెలియజేశారు. ఈ కమిటీల ఏర్పాటులో రాజకీయం జోక్యం లేకుండా చూడాలన్నారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తే తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కోసం కొనుగోలు చేసే వాహనాలకు స్టిక్కరింగ్ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కా
కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పట్టణాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి తక్షణమే వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే వాటిని క్రమబద్దీకరించుకునేందుకు కూడా అవకాశం కల్పించాలన్నారు.

ప్రస్తుతం అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కెటిఆర్ వివరించారు. ప్రజల కోణంలో నుంచి ఆలోచించి సిఎం కెసిఆర్ .. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. సిరిసిల్ల ప్రాంతం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. చిన్న కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయాలన్నా యుద్ధం చేయాల్సివచ్చేదని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. 4 ఏళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గతంలో కలెక్టర్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌తో పెద్దగా సంబంధాలు ఉండేవి కావన్నారు. కాని సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం కారమంగా పరిస్థితిలో సమూలంగా మార్పులు వచ్చాయన్నారు. ప్రతి పౌరుడు కోరుకునేలా రోడ్లు, మౌలిక సదుపాయాలు అందించాలని మంత్రి కెటిఆర్ అన్నారు. సిఎం కోరుకునే విధంగా పచ్చదనాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు.

అందుకు తగు ప్రణాళికబద్ధమైన ప్రగతిని ప్రజలకు అందించాలన్నారు. ప్రజలు అసాధారణమైన, గొంతెమ్మ కోరికలేమి కోరడంలేదన్నారు. వ్యవస్థీకృత పట్టణాలను ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి కనిపించేలా పట్టణాలను తీర్చిదిద్దాలని, దీని కోసం సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. పనిచేయని ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించే అసాధారణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం ద్వారా కల్పించిందన్నారు. టౌన్ ప్లానింగ్ విషయంలో సీరియస్‌గా ఉండాలని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలను నియంత్రించడం ద్వారానే అత్యుత్తమ పట్టణాలను రూపొందించేందుకు అవకాశముంటుందన్నారు. టిఎస్.. ఐపాస్ గురించి దేశంలో ఎక్కడికి వెళ్లినా గొప్పగా మాట్లాడుకుంటున్నారని, అదే రీతిలో బిపాస్ విధానానికి కూడా అలాంటి ఆదారణే లభించాలని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు. స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అసంతృప్తి కలగకుండా అధికారులు సమాధానం ఇవ్వాలని కెటిఆర్ సూచించారు.

Building construction Permits with TS B Pass
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News