Home జోగులాంబ గద్వాల్ ఎద్దుల ప్రాణాలను రక్షించిన రెవెన్యూ అధికారులు

ఎద్దుల ప్రాణాలను రక్షించిన రెవెన్యూ అధికారులు

Bulls fall in agriculture well

మన తెలంగాణ/గట్టు/
మండల పరిధిలోని అంతంపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్ద నర్సిములు తమ పొలంలో మేత మేస్తున్న రెండు ఎద్దులు పోట్లాడుతు నీరులేని గోతిలో పడిపొగా అది గమనించి రైతు పొలం ప్రక్కన ఉన్న రైతులతో ఎద్దులను గోతిలోంచి బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకుని రావడంతో ఎంఆర్‌ఒ సుందర్ రాజు, వీఆర్‌ఒ భాస్కర్,ఆర్‌ఐ శీను రైతు సమస్యను పరిష్కరించి ఎద్దుల ప్రాణాలను కాపాడాలని ఆదేశాలు జారిచేశారు. గ్రామానికి చేరుకున్న అధికారులు వీఆర్‌ఒలు,రైతుల సహయంతో వ్యవసాయ పరికరానికి తాడును బింగించి ఎద్దులను గోతిలోంచి ఒక్కోక్కటిగా బయటకు తీశారు. అనంతరం రైతు ఎద్దుల ప్రాణాలను రక్షించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.