Tuesday, April 23, 2024

ఊర మాస్ లుక్ లో ‘స్టైలీష్ స్టార్’.. బర్త్ డే గిఫ్ట్ అదిరింది

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ బర్త్ డే గిఫ్ట్ అదిరింది. బన్నీ, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్ లో మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బుధవారం బన్నీ పుట్టిన రోజు పురస్కరించుకొని చిత్రయూనిట్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మూవీకి ‘పుష్ప’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో బన్నీ చాలా ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్లు సమాచారం. సౌత్ ఇండియాలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ ఈ మూవీ విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో బన్నీ సరసన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Bunny’s PUSHPA Movie First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News