Home నల్లగొండ మూరెడు చదువుకి బారెడు బరువులు

మూరెడు చదువుకి బారెడు బరువులు

student-image

ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందా ఆగేదెన్నడు ?
యథేచ్ఛగా ఫీజులు పెంచుతున్న పాఠశాలలు
పది పాసయితే చాలు పంతుల్లే
విద్యా హక్కు చట్టానికి తూట్లు
నిద్రావస్థలో విద్యాధికారులు

అక్షరాలు నేర్చుకోవడానికి లక్షలు గుమ్మరించాల్సి వస్తోంది. ప్రవేశాల పేరిట ప్రైవేటు పాఠశాలలు దోచేస్తున్నాయి. పేర్లు మార్చి మార్చి జనం సొమ్మును దోచేస్తున్నారు. ప్రైవేటు పాఠశా లలకు ఒక్క సారి బ్రాండ్ క్రియేట్ అయితే బ్యాండ్ మోగాల్సిందే. దీంతో వారి ఫీజులకు, వారి బాదుడుకు అడ్డే లేకుండా పోతుంది. అడ్మిషన్‌ల టైం వస్తే చాలు తల్లిదం డ్రులకు గండమే. పిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా, మానసికంగా పడే ఆందోళన అంతా ఇంతా కాదు. సగటు మని షికి ప్రభుత్వ విద్య నిర్లక్షం కారణంగా ప్రైవేటు విద్య అందని ద్రాక్షగా మారుతుంది.

మనతెంలగాణ/చింతపల్లి : పాఠశాలలు తెరవడంతో గ్రామాలలో విద్యార్థులు బడులకు వెళ్లే హడావుడి మొదలయింది. దీంతో విద్యార్థుల బ్యాగుల మోత, తల్లిదండ్రులకు ఫీజుల మోత తయారయింది. విచ్చలవిడిగా పెరిగిన ఫీజలుతో జనం బెంబేలెత్తు న్నారు. పెరిగిన ఫీజలపై నిరసనలు మొదలయ్యాయి. దీనికి తోడు రాను రాను విద్యార్థుల బ్యాగుల మోత బరువు ఎక్కువవుతుంది. దీనికి పరిష్కారం చదువులు కొనడమేనా? ప్రవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతుంటే విద్యాధికారులు ఎందుకు స్పందించడం లేదనే పలువురి విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మండలంలో 8 ప్రాథమిక, ఉన్నత ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటన్నీటికి కలిపి సంఘం వుంది. అయితే పాఠశాల ఫీజలను పెంచే విషయంలో మాత్రం ఒక్కొ పాఠశాలకు ఒక్కొ రూలు ఉంది. నర్సరీ నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు ప్రతీ సంవ త్సరం నిబంధనలతో పని లేకుండా ఫీజులు పెంచు తారు. దీంతో ప్రైవేటు పాఠశాలల దందా ఇష్టారాజ్యం గా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతు న్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్లక్ష్యం పుణ్యమా అని ప్రతి ఒక్క రు ప్రైవేటు పాఠశాలల బాట పడుతున్నారు. ఇదే అదు నుగా భావించి ఫీజుల మోత మోగిస్తున్నారు. పాఠ శాల, డొనేషన్, వ్యాన్ ఆ ఫీజలు ఈ ఫీజలని అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ చదువుకునేది పోయి చదు వుకొనే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల వ్యవహారం వ్యా పారంగా మారింది. చూస్తుం డగానే ఇంతింతై వటుడింతై అనే మాదిరిగా ఎదిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చేసే వారే కురువ య్యారు. కాస్తా ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేటు పాఠశాలల వైపు పరిగెడుతున్నారు.దీంతో ప్రైవేటు పాఠశాలలు ఒక రేం జిలో రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలోనే ట్రైన్డ్ గల టీచర్లు ఉన్నప్పటికీ టీచర్లు, ప్రభుత్వం నిర్లక్షం కారణంగా వాటి వైపు వెళ్లే వారే కరువ య్యారు. కాన్సెప్టు స్కూల్లో చదవడం ఇప్పుడు ఫ్యాషన య్యింది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లలు చదువతారనే నమ్మకం పిల్లల తల్లిదండ్రుల్లో ఏర్పడింది.

పది పాసయితే చాలు పంతుళ్లే !
మండల పరిధిలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలలో ప్రైమరీ సెక్షన్‌లలో పది పాసయిన వారు లేదా ఇంటర్ ఫెయిల్ అయిన వారే విద్యా బోధన చేస్తున్నారనే విమ ర్శలు ఉన్నాయి. 6 నుంచి 10 తరగతి వారికి డిగ్రీ వర కు చదివిన వారు బోధిస్తున్నారు. కొన్ని పాఠశాలలో అయితే కేరళ టీచర్స్‌తో బోధన చెప్పిస్తున్నామని ప్రచా రం చేసి సొమ్ము దండు కుంటున్నారు. ట్రైన్డ్, టెట్ అ ర్హత గల ఉపాధ్యాయుల మాత్రమే బోధన చేయాల్సి ఉండగా అనుభవం లేని అర్హత లేని ఉపాధ్యాయులచే పాఠాలు చెప్పించి వారికి పదో పాతికో ఇచ్చి చేయి దులుపుకుంటున్నారు. అర్హత గల, అనుభవంగల ఉపాధ్యాయులకు అయి తే ఎక్కువ వేతనం ఇవ్వవలసి వస్తుందనే అంతర్యం వుంది. అధికారుల తనిఖీలలో మాత్రం అర్హత గల వారి పత్రాలను చూపించి వారిని మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక పుస్తకాలు, డ్రస్‌లు, బ్యాగులకు తక్కువేమి కావడం లేదని తల్లిదండ్రులు నిట్టూరుస్తున్నారు. విద్యార్థులకు సంబందించిన పుస్తకాలు కాని డ్రెస్‌లు కాని పాఠశాలలో లభిస్తు న్నాయి. బడి ఫీజు ఒక ఎత్తయితే వీటిని కొనడం మరోఎత్తవుతుంది. పలు రాకల పేర్లతో రాత పుస్తకాలను విద్యార్థులచే కొనిస్తూ విద్యార్థులకు మోపెడు బరువును కట్టబెడుతున్నారు. దీనికి తోడు లంచ్ బాక్స్ కూడా వుండడంతో చిన్న వయసులోనే అధిక బరువులను మోయాల్సి వస్తుంది. విద్యార్థి ఎదగవలసిన సమయంలో వంగి పోతున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిద్రావస్థలో విద్యాధికారులు
మండల పరిధిలో ఉన్న పాఠశాలలో ఇంత తతంగం జరుగుతున్నా ప్రైవేటు పాఠశాలలపై ఏ విద్యాధికారి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లల తల్లిదండ్రులు ఎంత మొత్తుకున్నా, విద్యార్థి సంఘాలు ఎన్నో సార్లు ధర్నాలు, రాస్తోరోకోలు నిర్వహించిన అధికారుల్లో చనలం లేదనే విమ ర్శలు ఉన్నాయి. ఈ విద్యా సంవ త్సరం ఆరంభంలోనే వుంది కాబట్టి నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రైవేటు పాఠాశాలలపై చర్యలు తీసుకోవాలి.
నిబంధనలు అతిక్రమంచి విద్యార్థుల వద్ద విచ్చలవిడిగా డబ్బులను దండుకుంటున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

విద్యాధికారులు విధిగా తనిఖీలు చేపట్టాలి
అర్హత గల ఉపాధ్యాయులను నియ మించి వారికి న్యాయపరంగా జీతాలివ్వాలి. ఫీజల దోపిడీ పేరుతో విద్యా ర్థులను వేది స్తే ఊరు కోం. రానున్న రోజు ల్లో ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్య మాలు