Home జాతీయ వార్తలు అభినవ చింతామణి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత

అభినవ చింతామణి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి కన్నుమూత

Burra Subrahmanya Sastriహైదరాబాద్‌: ప్రముఖ నాటక రంగ కళాకారుడు,  అభినవ చింతామణిగా ప్రసిద్ధిగాంచిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి(84) ఆదివారం కన్నుమూశారు.  కొంత కాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మెహదీపట్నంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నాటక రంగంలో‌ నటుడిగా ,దర్శకుడిగా సుబ్రహ్మణ్యశాస్త్రి మంచి గుర్తింపు పొందారు. నాటకరంగంలోని చాలామంది ప్రముఖులు ఆయన శిష్యులు కావడం గమనార్హం. తెలుగు భాషకు, సాహిత్యానికి, నాటకరంగానికి  చేసిన సేవలకు గానూ ఆయన ఎన్నో అవార్డులు , రివార్డులను అందుకున్నారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ సుబ్రహ్మణ్య శాస్త్రి పెద్ద కుమారుడు. సుబ్రహ్మణ్య శాస్త్రి మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సుబ్రహ్మణ్య శాస్త్రి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

Burra Subrahmanya Sastri Passed Away