Home తాజా వార్తలు బస్‌పాసుల ధరలు పెంపు

బస్‌పాసుల ధరలు పెంపు

Bus-Passహైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్సు పాసుల ధరలు పెరిగాయి. పెరిగిన బస్‌పాస్ ధరలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. నెలవారీ బస్‌పాస్ ధరలు.. ఆర్డినరీ బస్ పాస్ ధర రూ. 700 నుంచి రూ. 770కి పెంపు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధర రూ. 800 నుంచి రూ. 880కి పెంపు. మెట్రో డీలక్స్ బస్‌పాస్ ధర రూ. 900 నుంచి రూ. 990కి పెంపు. ఎన్జీవోలకు ఇచ్చే బస్‌పాస్ ధరలు కూడా పెరిగాయి. ఎన్జీవోలకు ఇచ్చే ఆర్డినరీ బస్‌పాస్ ధర రూ. 235 నుంచి రూ. 260కి పెంపు. ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ ధర రూ. 335 నుంచి రూ. 370కి పెంపు. మెట్రో డీలక్స్ బస్‌పాస్ ధర రూ. 435 నుంచి రూ. 480కి పెంచారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్ రైళ్లలో ఉమ్మడి ప్రయాణం బస్‌పాస్ ధర రూ. 800 నుంచి రూ. 880కి పెంచారు. నగరంలో ఒక రోజుకు జారీ చేసే టికెట్ ధర రూ. 70 నుంచి రూ. 80కి పెంచడం జరిగింది.