Home జయశంకర్ భూపాలపల్లి వాగులో చిక్కుకున్న బస్సు

వాగులో చిక్కుకున్న బస్సు

Bus

 

సురక్షితంగా బయటపడిన 40మంది మేడారం భక్తులు, ఫలించిన తక్షణ సహాయ చర్యలు

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో ప్రైవేట్ ట్రావెల్‌బస్సు వాగులో చిక్కుకున్న సంఘటన జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెగడపల్లి, కేశనపల్లి గ్రామాల మధ్యన ఉన్న పెద్దవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అదేక్రమంలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు మేడారంకు అదే దారి గుండా భక్తులు దర్శనానికని వెళ్తుండడంతో శనివారం రాత్రి నుండి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉదృతి పెరిగి ఒక్కసారిగా లోతట్టు ప్రాంతమైన పెద్దవాగు ఉప్పొంగడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు వాగులో చిక్కుకుంది. దీనితో లారీ సహాయంతో బస్సును గ్రామస్తులు బయటకు తీశారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని తక్షణ చర్యలు చేపట్టి బయటకి తియ్యడంతో అందులో ఉన్న వారంతా ఊపరి పీల్చుకున్నారు.

Bus stuck in Wagu