Home తాజా వార్తలు తప్పిన ’ప్రయాణ ’పాట్లు

తప్పిన ’ప్రయాణ ’పాట్లు

Buses

 

హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికుల సమ్మె నేపథ్యంలో యాజమాన్యం ప్రణాళికబద్దమైన కార్యచరణ ప్రణాళిక ద్వారా అను నిత్యం ప్రయాణికుల పాట్లను తగ్గించి, విస్తృతమైన రవాణా సౌకర్యాలను అందించే దిశగా కృషి సాగిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇన్‌ఛార్జీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ సారథ్యంలో ప్రయాణికుల అసరాల మేర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్‌లలో ఆర్‌టిసి సంస్థ, అద్దె బస్సులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. శనివారం ఆర్‌టిసి సంస్థ పరిధిలోని 11 రీజియన్‌ల ఆధీనంలోని 97 బస్సు డిపోల నందు పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులను అందుబాటులో వచ్చాయని విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు.

ఈ ప్రకటనలో 6,509 బస్సులతో పాటు 2,443 ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల సౌకర్యాలను తీర్చాయని వివరించారు. అలాగే నిర్దేషిత షెడ్యూల్ ప్రకారం డిపోల నుంచి బస్సులను నడుపుతున్నారు. స్వల్ప విడిది కల్గిన రూట్‌లతో పాటు లాంగ్, నైట్ హాల్ట్ రూట్‌లలో సహితం బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు సాధారణ రవాణా సేవలు అందాయని వెల్లడించారు.

ఇదిలా ఉండగా శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 72.70 శాతం బస్సులను నడిచాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,609 మంది తాత్కాలిక డ్రైవర్‌లు, 6,506 మంది తాత్కాలిక కండక్టర్‌లు విధుల నిర్వహణలో భాగస్వాములు కాగా, 6,209 బస్సు సర్వీసుల నందు టిమ్ యంత్రాల ద్వారా టికెట్లు జారీ చేశామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

Buses for all Road Routes