Home తాజా వార్తలు జిఎస్‌టి రిటర్న్ ఫారాలు సరళతరం

జిఎస్‌టి రిటర్న్ ఫారాలు సరళతరం

GST
గడువు తేదీ కూడా పొడిగింపు

న్యూఢిల్లీ: ప్రభుత్వం వ్యాపారులకు ఊరట ఇచ్చింది. జిఎస్‌టికి చెందిన రెండు రిటర్న్ ఫారాలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. దీంతో పాటు ఈ రిటర్న్ ఫారాలను సమర్పించడానికి చివరి తేదీని కూడా పొడిగించింది. జిఎస్‌టిఆర్ -9 (వార్షిక రిటర్న్), జిఎస్‌టిఆర్ 9సి గడువు తేదీలను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సిబిఐసి) పొడిగించింది. ఇప్పుడు వ్యాపారవేత్తలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2019 డిసెంబర్ 31 వరకు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 31 మార్చి 2020 వరకు ఫారం దాఖలు చేయొచ్చు. కొత్త నిబంధనలకు సంబంధించి సిబిఐసి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఈ రిటర్న్ ఫారమ్‌లను నింపేటప్పుడు వ్యాపారవేత్తలు విడిగా ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను అందించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 2017-18 ఆర్థిక సంవత్సరానికి జిఎస్‌టి రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30గా, అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి చివరి తేదీ డిసెంబర్ 31గా నిర్ణయించింది.

Businesses to get more time to file GST annual returns