Home తాజా వార్తలు నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Businessman brutally murdered at chandrayangutta

 

కిలో బంగారం వివాదమే కారణం?

మనతెలంగాణ/చాంద్రాయణగుట్ట : కిలో బంగారం వివాదం ఒక యువకుడి హత్యకు దారి తీసింది. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి, బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం… పాతబస్తీ బార్కాస్‌కు చెందిన హమీద్ బిన్ అలీ జుబేది (47) స్థానికంగా వెస్ట్రన్ యూనియన్ ఆఫ్ మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణం నిర్వహిస్తుంటాడు. జుబేదికి అదే ప్రాం తానికి చెందిన ఆదిల్ జాబ్రి, సయీద్ జాబ్రి, రహిద్ జాబ్రి, సహాద్ జాబ్రి అనే అన్నదమ్ములతో పరిచయం ఉంది. వారి మధ్య స్నేహం పెరిగింది. ఆదిల్ జాబ్రి దుబాయ్‌లో ఉం టూ 2019లో నగరానికి వచ్చాడు. ఆ సమయంలో శంషాబాద్ వి మానాశ్రయంలో కిలో బంగారంతో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతని పాస్‌పోర్టును సీజ్ చేసి జైలుకు పంపించారు. జైలు నుండి వచ్చిన ఆదిల్ జాబ్రికి, జుబేదికి మధ్య పట్టుబడ్డ బంగారం విషయంలో గొడవ జరుగుతుంది.

ఈ క్రమంలో ముంతాజ్‌బాగ్‌లో ఇల్లు నిర్మిస్తున్న జుబేది వద్దకు వెళ్ళిన ఆదిల్ జాబ్రి తన పాస్‌పోర్టు తిరిగి ఇప్పించాలని, తాను దుబాయ్ వెళ్ళాలంటూ పట్టుబట్టా డు. దీంతో జుబేది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బండ్లగూడ ప్రా ంతంలోని చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌కు కారులో (ఏపీ 11ఏక్యూ 7565) బయలు దేరాడు. విషయం తెలుసుకున్న ఆదిల్ జాబ్రి సోదరులు సయీద్ జాబ్రి, రహీద్ జాబ్రి, సహాద్ జాబ్రిలతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై వె ళ్ళి హషామాబాద్ వద్ద జుబేది కారు ను అటకాయించారు. అతనిపై కత్తులతో దాడి చేశారు. తలపై బండ రా యితో మోదారు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న జుబేదిని ఉస్మానియా కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించారు.

దక్షిణ మండల డీసీపీ గజారావు భూపాల్ సంఘటనా స్థలిని పరిశీలించి హత్య జరిగిన తీరును తెలుసుకున్నారు. పోలీసులు క్లూస్ టీమ్స్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ గజరావు భూపాల్ మాట్లాడుతూ కస్టమ్స్‌కు పట్టుబడ్డ కిలో బంగారం, డబ్బు విషయంలోనే జుబేది, జాబ్రి కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఆదిల్ జాబ్రి, సయీద్ జాబ్రి, రహిద్ జాబ్రి, సహాద్ జాబ్రిల మధ్య శత్రుత్వం పెరిగినట్లు తెలిసిందన్నారు. నిందితులను పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను రం గంలోకి దింపినట్లు వెల్లడించారు. కాగా నిందితులు తొలిసారిగా హ త్యకు పాల్పడ్డారని, వారిపై కస్టమ్స్ కేసులున్నట్లు తెలిసిందన్నారు. జుబేది హత్యోదంతం తెలిసిన బార్కాస్‌కు చెందిన యువకులు పెద్ద ఎత్తున చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు.

Businessman brutally murdered at chandrayangutta