Home జయశంకర్ భూపాలపల్లి మేడారంలో భక్తుల కోలాహలం

మేడారంలో భక్తుల కోలాహలం

Medaram

 

తాడ్వాయి : వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మలను దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాలైన హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, చత్తీస్‌ఘడ్, తదితర ప్రాంతాల నుండి తరలివచ్చారు. ముందుగా తల్లులకు పసుపు, కుంకుమ పూలు, పండ్లు, నూతనవస్త్రాలు, బెల్లం(బంగారం) కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

జాతర పరిసర ప్రాంతాలైన మ్యూజియం చిలుకల గట్టు, సారలమ్మగుడి, జంపన్నవాగు తదితర ప్రాంతాలను సందర్శించి ఉల్లాసంగా గడిపారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు కోళ్లను, మేకలను కోసుకొని వంటలు చేసుకొని తిని తిరిగి వెళ్లారు. దర్శనానికి వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు రఘు, మధు, రాజేశ్వర్, వీనన్, వీరన్న, బాలకృష్ణ తదితరులు సేవలు అందించారు.

Bustle of devotees in Medaram