Friday, April 19, 2024

టాప్ ట్రెండింగ్ లో ‘బుట్ట బొమ్మ’ వీడియో సాంగ్..

- Advertisement -
- Advertisement -

 

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం బన్నీ, త్రివిక్రమ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.  విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు సంచలనం సృష్టించాయి. తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా పాటలు వంద మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ పూర్తి వీడియో సాంగ్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట విడుదలైన గంటలోనే 5 లక్షల వ్యూస్ సంపాదించి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ వీడియో సాంగ్ ని మీరు చూడండి.

Butta Bomma full Video Song Released from AVPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News