Thursday, March 28, 2024

సెమీస్‌లో శ్రీకాంత్, లక్ష్యసేన్

- Advertisement -
- Advertisement -

BWF World Championships:Srikanth and Lakshyasen in the semis

క్వార్టర్ ఫైనల్లోనే సింధు ఔట్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

హుఎల్వా(స్పెయిన్): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్లు లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు కనీసం రెండు పతకాలు ఖాయమన్నాయి. ఇక మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, టైటిల్ ఫేవరెట్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూసింది. దీంతో దీంతో సింధు టైటిల్ ఆశలు నీరుగారాయి. ఇక తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత యువ సంచలనం లక్షసేన్ ఏకంగా సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాడు. ఇక తెలుగుతేజం శ్రీకాంత్ కూడా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. దీంతో టోర్నీలో భారత్‌కు రెండు పతకాలు ఖరారయ్యాయి.

లక్ష్యసేన్ సంచలనం..

ఇక పురుషుల సింగిల్స్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ చారిత్రక ప్రదర్శనతో అలరించాడు. శుక్రవారం జరిగిన హోరాహోరీ క్వార్టర్ ఫైనల్లో లక్షసేన్ చైనా షట్లర్ జాహో జున్ పెంగ్‌ను చిత్తు చేశాడు. మూడు సెట్ల ఉత్కంఠ సమరంలో భారత షట్లర్ 2115, 1521, 2220 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభ సెట్‌లో లక్ష్యసేన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగాడు. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇదే సమయంలో అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ రెండో గేమ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి ప్రత్యర్థి షట్లర్ ఆధిపత్యం చెలాయించాడు. లక్షసేన్ దూకుడుకు బ్రేక్ వేస్తూ ముందుకు సాగాడు. చెలరేగి ఆడిన పెంగ్ సునాయసంగా సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. కళ్లు చెదిరే షాట్లతో కనువిందు చేశారు. ఇద్దరు హోరాహోరీగా పోరాడడంతో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇక ఇందులు ఆఖరు వరకు నిలకడగా రాణించిన లక్ష్యసేన్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.

శ్రీకాంత్ అలవోకగా..

అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ విజయం సాధించాడు. నెదర్లాండ్స్ షట్లర్ మార్క్ కాల్జొవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 218, 217తో అలవోకగా గెలిచాడు. ఆరంభం నుంచే శ్రీకాంత్ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. శ్రీకాంత్ ధాటికి ప్రత్యరి ఎదురు నిలువలేక పోయాడు. అసాధారణ ఆటతో చెలరేగిన శ్రీకాంత్ ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. ఈ విజయంతో శ్రీకాంత్‌కు కాంస్యం ఖాయమైంది.

భారత్‌కు రజతం ఖాయం..

మరోవైపు శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్లు శ్రీకాంత్, లక్ష్యసేన్ తలపడనున్నారు. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రజతం ఖాయమైంది. గెలిచిన ఆటగాడికి రజతం దక్కనుంది. అంతేగాక ఓడిన ఆటగాడికి కాంస్యం దక్కనుంది. దీతో భారత్‌కు ఒక రజతం, మరో కాంస్య ఇప్పటికే ఖరారైంది.

సింధు ఇంటికి..

ఇదిలావుండగా మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి భారత అగ్రశ్రేణి షట్లర్ సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఈసారి కూడా ప్రపంచ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన సింధు శుక్రవారం జరిగిన పోరులో టాప్ సీడ్ తైజు ఇంగ్ ఇంగ్ (చైనీస్ తైపి) చేతిలో కంగుతిన్నది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన తైజు ఇంగ్ 2117, 2113 తేడాతో సింధును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కనీసం కాంస్యం ఖాయం చేసుకోవాలని భావించిన సింధు ఆశలపై తైజు ఇంగ్ నీళ్లు చల్లింది. ఎప్పటిలాగే ఈసారి కూడా తైజు చేతిలో సింధు ఓటమి పాలైంది. ఈ ఏడాది సింధు ఒక్క టైటిల్ కూడా సాధించలేదు. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శనతో టైటిల్ సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సింధు కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News