Home తాజా వార్తలు 10 అసెంబ్లీ, 4 లోక సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

10 అసెంబ్లీ, 4 లోక సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

 Polling Started in RK nagar

ఢిల్లీ: పది అసెంబ్లీ, నాలుగు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా, మహారాష్ట్రలోని పాల్దర్, బండారా-గోండియా, నాగాలాండ్ పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. యుపిలోని నూర్పూర్, పశ్చిమబెంగాల్‌లోని మహేశ్తల, మేఘాలయలోని అంపటి, ఉత్తరాఖాండ్‌లోని తరాలి, కేరళలోని చెంగనూరు, జార్ఖండ్‌లోని గోమియా, సిల్లీ, బీహార్‌లోని జోకిహాట్, పంజాబ్‌లోని షాకోట్, మహారాష్ట్రలోని పాలూస్ కాడేగాన్, కర్నాటకలోని ఆర్‌ఆర్ నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల సమరంలో జనం నాడికి ఈ ఉప ఎన్నికలు సూచీలుగా ఉంటాయని రాజకీయ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.