Tuesday, March 21, 2023

15లోగా జాతీయ రహదారుల పనులు పూర్తి

- Advertisement -

CONFE

* త్వరితగతిన భూసేకరణ జరగాలి
* రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి పనులను వచ్చే మార్చి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సంబంధితశాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో జాతీయ రహదారుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో రోడ్ల నిర్మాణ పనుల భూసేకరణ విషయంలో జాప్యం జరుగుతుందని త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా రూరల్‌జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణపై మంత్రి ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను ఆరా తీశారు. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.హరిత మాట్లాడుతూ నర్సంపేటలో కోర్టు వివాదం కారణంగా స్థల సేకరణలో జాప్యం జరిగిందని ప్రస్తుతానికి స్థలం అప్పగించామని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ స్థల సేకరణకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రింగ్ రోడ్‌కు స్థల సేకరణలో జాప్యం జరుగుతుందని ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పరిపాలన అనుమతులు ఉన్నా జాపయం ఎందుకు జరుగుతుందని, అదేవిధంగా భట్టుపల్లి జాతీయ రహదారికి స్థల సేకరణ చేసి ప్రతిపాదన పంపాలని తుమ్మల నాగేశ్వర్‌రావు తెలుపగా, దీనికి వరంగల్ అర్బన్ జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ దయానంద్ సమాధానమిస్తూ ఈనెల 25లోగా స్థల సేకరణ త్వరితగతిన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, ఈఈ లక్ష్మన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles