Home తాజా వార్తలు బైజుస్ చేతికి ఎపిక్

బైజుస్ చేతికి ఎపిక్

Byju's acquires american reading platform epic for $500 million

 

500 మిలియన్ డాలర్లతో కొనుగోలు

బెంగళూరు : పన్నెండేళ్ల లోపు చిన్నారులకు సంబంధించిన అమెరికా డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎపిక్’ను ఎడ్యుకేషన్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘బైజుస్’ సొంతం చేసుకుంది. సుమారు 500 మిలియన్ డాలర్లకు ఈ ఎపిక్ ప్లాట్‌ఫామ్‌ను బైజుస్ కొనుగోలు చేసింది. దీని ద్వారా అమెరికాలో బైజుస్ ప్రవేశించడమే కాకుండా చిన్నారుల్లో బోధనా పరమైన అంతరాన్ని భర్తీ చేయనుంది. దీంతో ఉత్తర అమెరికాలో భారత ఎడ్‌టెక్ సంస్థ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికకు సిద్ధం కానుంది. గత సంవత్సరం 300 మిలియన్ డాలర్లతో కోడింగ్ ప్లాట్‌ఫామ్ వైట్‌హ్యాట్ జూని యర్‌ను బైజుస్ కొనుగోలు చేసింది. దీని తర్వాత ప్రస్తుత డీల్ మరో పెద్ద ఒప్పం దం కానుంది. ఎపిక్ దాదాపు 51 మిలియన్ డాలర్లను సమీకరించింది. రెండేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ గేమ్స్ తయారీ సంస్థ ఓస్మోను బైజుస్ సుమా రు 16.5 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇటీవల బైజుస్, వాల్ట్ డిస్నీ సంయుక్తంగా కొబ్రాండెడ్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించాయి. క్లాస్ 3 విద్యార్థుల కు కిండర్‌గార్టెన్‌ను లక్షంగా చేసుకుని ఈ యాప్‌ను రూపొందించారు.

Byju’s acquires american reading platform epic for $500 million