Saturday, April 20, 2024

‘ఇలా ప్రవర్తిస్తుందనుకోలేదు.. ముమైత్ ఖాన్ పై ఫిర్యాదు చేస్తా’: డ్రైవర్ రాజు

- Advertisement -
- Advertisement -

Cab Driver Raju to complaint on Actor Mumaith Khan

ముంబై: నటి ముమైత్ ఖాన్ తనను బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించిందని క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు వెళ్లాలని ముమైత్ కారు బుక్ చేసుకుందని.. టోల్ గేట్‌కు, డ్రైవర్ అకామిడేషన్‌కు డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. తనకు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో వివరించాడు. ‘మూడు రోజులని ఐదు రోజులపాటు గోవాలో తిప్పింది. డీజిల్ ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టింది. కారులోనే మద్యం, సిగరేట్ తాగుతూ అసభ్యంగా ప్రవర్తించింది. అలా చెయ్యొద్దని చెప్పినందుకు బూతులు తిట్టి.. బెదిరించింది. చాలా టార్చర్ చేస్తుందని ముమైత్ ఖాన్ డ్రైవర్లు చెప్పారు. రోజూ కూలి చేసుకునే నా పట్ల ఇలా వ్యవహరి స్తుందనుకోలేదు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు చెప్పా. మా డ్రైవర్ల అసోసియేషన్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని డ్రైవర్ రాజు వాపోయాడు.

Cab Driver Raju to complaint on Actor Mumaith Khan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News