Friday, April 19, 2024

సమగ్ర శిక్షా పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Cabinet Approves Samagra Shiksha Scheme 2.0

న్యూఢిల్లీ : దేశంలో పాఠశాల విద్యను మరింత మెరుగు పర్చడానికి సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి దేశంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాల కేసుల సత్వర విచారణ, దోషులకు గరిష్ఠ శిక్షల విధింపు కోసం అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ప్రత్యేక పథకాన్ని కూడా మరో రెండేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

సమగ్రశిక్ష పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే స్కూళ్లను ఏర్పాటు చేయడంతోపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. పాఠశాల విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ ఏర్పాటుకు కేంద్రం సాయం చేస్తుంది. ఈ పథకం కోసం రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమగ్రశిక్ష పథకం 2 గా పిలవబడే ఈ పథకం కోసం మొత్తంగా రూ.2,94,283 కోట్లు కేటాయించగా, ఇందులో కేంద్రం వాటా 1,85,398 కోట్లుగా పేర్కొన్నారు. ఈ పథకం పరిధి లోకి దేశ వ్యాప్తంగా 11.60 లక్షల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, 15.6 కోట్ల మంది విద్యార్థులు, 57 లక్షల మంది ఉపాధ్యాయులు వస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News