Home జాతీయ వార్తలు ఎక్కడో గ్యాప్ ఉంది.. జాగ్రత్త

ఎక్కడో గ్యాప్ ఉంది.. జాగ్రత్త

Gap

 

విదేశాలనుంచి వచ్చిన వారిపై గట్టి నిఘా పెట్టండి
కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు భారత దేశానికి చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించే బాధ్యతను మరింత వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాలకు లేఖ రాశారు. విదేశాలనుంచి వచ్చిన వారి సంఖ్యకు, నిఘాలో ఉన్న వారి సంఖ్యకు మధ్య ఎక్కడో తేడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కోవిడ్19ను అరికట్టడానికి అందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ ఆ చర్యలకు వీటితో ఘోర ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని ఆ లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ అంతర్జాతీయ ప్రయాణికులు భారీగా చేరుకున్నారని, వారిపై దృష్టిని మరింత తీవ్రం చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటివరకు ఎంతమంది అంతర్జాతీయ ప్రయాణికులు భారత్ వచ్చారో మాత్రం ఆయన తన లేఖలో పేర్కొనలేదు.

అయితే హోం శాఖ అధీనంలోని ఇమిగ్రేషన్ విభాగం మాత్రం ఇప్పటివరకు 15 లక్షల మంది నిఘాలో ఉన్నట్లు సూచిస్తోంది. అయితే ఈ రెండింటి మధ్య ఎక్కడో గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ కోవిడ్19 వ్యాప్తిని అరికట్టడానికి విదేశాలనుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టడం చాలా ముఖ్యం’ అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. అయితే విదేశాలనుంచి ఆయా రాష్ట్రాలకు చేరుకున్న వారిపై నిఘా ఉంచాలని కేంద్రం సూచించడం ఇది మొదటి సారి కాదు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇదివరకే చాలా సార్లు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ‘కేంద్ర ఆరోగ్య శాఖ ఈవిషయమై పదేపదే నొక్కి చెబుతూనే ఉంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్షణం చర్యలు తీసుకోవలసిందే. విదేశీయులపై నిఘా పెంచి నిబంధనల ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా’ అని గౌబే ఆ లేఖలో స్పష్టం చేశారు.

Cabinet secretary says gap in actual monitoring