Home తాజా వార్తలు కేబుల్ ఆపరేటర్లు చేదువార్త

కేబుల్ ఆపరేటర్లు చేదువార్త

Cable operators bad news
రెండు తెలుగు రాష్ట్రాల్లో టివిలు చూస్తూ వినోదాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు కేబుల్ ఆపరేటర్లు చేదువార్త చెప్పారు. ట్రాయ్ కొత్త టారిఫ్ అమలుకు సంబంధించి తాజాగా కేబుల్ ఆపరేటర్లకు జనవరి 31, 2019ని డెడ్‌లైన్‌గా విధించింది. ఈ ట్రాయ్ నిర్ణయాన్ని కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ… ఎపి రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. న్యూస్ ఛానల్స్ మినహాయించి మిగిలిన ఛానల్స్ ప్రసారాలను రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.
ట్రాయ్ తీసుకున్న నిర్ణయం వల్ల వినియోగదారులు 400 నుంచి 450 రూపాయలు కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుందని, ప్రస్తుతం వినియోగదారులకు 200 నుంచి 250 రూపాయలు చార్జ్ చేస్తూ 400ల ఛానళ్ల వరకూ అందిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి గౌడ్ లింగాల మాట్లాడుతూ.. ట్రాయ్ నిర్ణయం వినియోగదారుల నెత్తిన పిడుగు లాంటిదని, కేబుల్ వ్యవస్థ మనుగడకే ప్రమాదమని చెప్పారు. ట్రాయ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ అనుసంధానంలో విఫలం కావడంతో ట్రాయ్ గతంలో ప్రకటించిన డెడ్‌లైన్‌ను పొడిగించింది. ట్రాయ్ డెడ్‌లైన్‌ను పొడిగించిందని కానీ ట్రాయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన ఆగదని హరి గౌడ్ ప్రకటించారు.
Cable operators bad news for Telugu audiences

Telangana Latest News