Saturday, April 20, 2024

బాలలకు ఆపద వస్తే.. డయల్ 1098

- Advertisement -
- Advertisement -
Call 1098 if children are in danger
ఆహారం సేకరిస్తారనే ప్రచారం అబద్ధం : హెల్ప్‌లైన్

హైదరాబాద్: బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ పనిచేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1098 హెల్ప్‌లైన్‌కు డయల్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో ప్రధాని ప్రకటించారని అంటూ ‘మీ ఇంట్లో మీకు ఏదైనా ఫంక్షన్/ పార్టీ ఉంటే… మీరు చాలా ఆహారం వృధా అయ్యే అవకాశం ఉన్నట్లయితే, దయచేసి 1098కి కాల్ చేయడానికి వెనుకాడకండి.. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది వచ్చి ఆహారాన్ని సేకరిస్తారు. దయచేసి చాలా మంది పిల్లలకు ఆహారం అందించడంలో సహాయపడే ఈ సందేశాన్ని ప్రసారం చేయండి’ అంటూ ప్రాచుర్యంలో ఉంది. ఈ విషయాన్ని పలువురు ప్రస్తావించడంతో హెల్ప్‌లైన్‌కు డయల్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News