Tuesday, March 21, 2023

క్యాంపస్ నియామకాలం

- Advertisement -

student

*చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు వచ్చే కోర్సులకు, కాలేజీలకే తల్లిదండ్రుల ప్రాధాన్యం 

మన తెలంగాణ/ హైదరాబాద్ : కోటి విద్యలు కూటి కోసమే అని నానుడి. కొంతమంది వద్ద ఎన్ని డిగ్రీలు ఉన్నా నిరుద్యోగులుగానే ఉంటుండగా, మరికొందరు ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇలాంటి పరిస్థితులు గమనిస్తున్న తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా మారుతోంది. మంచి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల్లోనే తమ పిల్లలను చేర్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఫీజు ఎక్కువైనా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బాగా ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకే పరిమితమైన ప్రాంగణ నియామకాల సంస్కృతి ఇప్పుడు అంతటా వ్యాపించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సుల నుంచి సాధారణ డిగ్రీ వరకు కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు బాగున్నాయో లేదో తెలుసుకొని మరీ అడుగు ముందుకేస్తున్నారు. ఒక్కో విద్యార్థి రెండు, మూడు ప్రవేశ పరీక్షలకు హాజరైనా, చివరకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మెరుగ్గా ఉన్న కోర్సుల్లో, కళాశాలల్లో చేరేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
నైపుణ్యాల ఆధారంగానే నియామకాలు : విద్యార్థుల నైపుణ్యా ల ఆధారంగా కంపెనీలు ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుత పోటీ వాతావరణంలో సమర్థులైన అభ్యర్థులకు లక్షల రూపా యల ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. సమర్థులైన అభ్యర్థులకు ఏడాదికి రూ.7 నుంచి రూ.7.5 లక్షల వరకు ఇస్తున్నాయి. ఇన్ఫోసిస్, టిసిఎస్, డిప్రో, అమెజాన్ వంటి ప్రతిష్ఠాత్మ క కంపెనీలు సమర్థులైన ఉద్యోగుల కోసం విద్యాసంస్థల ముందు బారులు తీరుతున్నాయి. తమ అవసరాలకు సరిపడే ఉద్యోగుల కోసం ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నాయి. కోర్సు ఏదైనా, కాలేజీ మరేదైనా క్యాం పస్ నియామకాలు ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
టెక్నికల్ వర్సెస్ కన్వెన్షనల్ : ప్రాంగణ నియామకాలలో కంపెనీలు టెక్నికల్ విద్యార్థులకే ప్రాధాన్యమిస్తున్నాయని, సంప్రదా య డిగ్రీ విద్యార్థులకు అవకాశాలు అందట్లేదనే ఆరోపణల్లో నిజం లేదని కొన్ని ప్రాంగణ నియామకాలు రుజువు చేస్తున్నా యి. డిగ్రీ విద్యార్థులకు కూడా ఇప్పుడు అవకాశాలు విస్తరిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్ అందించే కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఏటా రూ. 50వేల, -60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు ఎక్కువైనా, తలిదండ్రులు తమ పిల్లలపై వెచ్చించే ఖర్చు ఎక్కువైనా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇచ్చే కళాశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ డిగ్రీ విద్యార్థుల విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన సమస్య. ప్రాంగణ నియామకాలు కోరుకునే విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం పొందినప్పటి నుంచే ఇతర నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలి.
ఇతర నైపుణ్యాలు అవసరమే : క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ప్యాకేజీతో కోరుకున్న ఉద్యోగం వచ్చినప్పుడు మూడు, నాలగేళ్ల విద్యార్థుల శ్రమకు సరైన గుర్తింపు వచ్చినట్లు. ప్రస్తుత నియామకాల తీరును పరిశీలిస్తే కేవలం సంబంధిత డిగ్రీ సబ్జెక్ట్‌లోనే ప్రా వీణ్యం సరిపోవడం లేదు. ఇతర స్కిల్స్, విశ్లేషణా సామర్థం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నా రు. అందుకే విద్యార్థులు కోర్సులే చేరినప్పటి నుంచి అకడమిక్ అంశాలకే ప రిమితం కాకుండా ఇతర నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలని ని పుణులు సూచిస్తున్నారు. అలాగే ఎప్పటి పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధి స్తూసాధిస్తూ బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles