Home జాతీయ వార్తలు భారత్‌లోకి ఏ ఒక్క చైనా సైనికూడూ ప్రవేశించలేదని చెప్పగలరా..?: రాహుల్‌గాంధీ

భారత్‌లోకి ఏ ఒక్క చైనా సైనికూడూ ప్రవేశించలేదని చెప్పగలరా..?: రాహుల్‌గాంధీ

Can govt confirm no Chinese soldier entered India

 

న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి ఏ ఒక్క చైనా సైనికుడూ ప్రవేశించలేదని ప్రభుత్వం స్పష్టం చేయగలదా అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతపై మంగళవారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ తూర్పు లద్దాఖ్‌లో చైనా బలగాల కదలికలున్నాయంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఈమేరకు రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. తూర్పు లద్దాఖ్‌లో సైనిక మోహరింపులపై ఇరు దేశాల ఉన్నతస్థాయి సైనికాధికారుల మధ్య ఈ నెల 6న జరగనున్న భేటీ గురించి కూడా రాహుల్ ప్రస్తావించారు.

Can govt confirm no Chinese soldier entered India