Friday, April 19, 2024

వింబుల్డన్ ఓపెన్ రద్దు

- Advertisement -
- Advertisement -

Wimbledon Open

 

లండన్: కరోనా దెబ్బకు మరో పెద్ద మెగా ఈవెంట్ బలైంది. ప్రపంచ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా పేరు తెచ్చుకున్న వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. కరోనా మహమ్మరి ఉగ్రరూపం దాల్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది జరగాల్సిన వింబుల్డన్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. జూన్ 29 నుంచి ఈ మెగా గ్రాండ్‌స్లామ్ టోర్నీ జరగాల్సి ఉంది. ఇక, కరోనా కారణంగా ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఇక, అమెరికా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ నిర్వహణ కూడా సందేహంగా మారింది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో క్రీడలు వాయిదా వేయక తప్పలేదు. జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అంతేగాక ప్రపంచంలోనే అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ టోర్నీగా పేరున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీ కూడా వాయిదా పడింది.

అంతేగాక పలు దేశాల మధ్య క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా అర్ధాంతరంగా రద్దు చేశారు. దీంతోపాటు బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్, ఫార్మూలావన్, టిటి,ఫుట్‌బాల్, స్విమ్మింగ్, షూటింగ్, అథ్లెటిక్స్ క్రీడలను వాయిదా వేయడమే లేక పూర్తిగా రద్దు చేయడమో జరిగింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మమైన టెన్నిస్ టోర్నీగా పేరున్న వింబుల్డన్‌ను రద్దు చేస్తున్నట్టు ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సహా అమెరికా, యూరప్ దేశాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్ని విలవిల్లాడుతున్నాయి. తాజాగా కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లో ఆరు నెలల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

ఇలాంటి స్థితిలో వింబుల్డన్ వంటి మెగా టోర్నీని నిర్వహించడం తమ వల్ల కాదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు వివరించారు. కాగా, వింబుల్డన్ టోర్నీని రద్దు చేయడం తొలి ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలావుండగా టోర్నీని రద్దు చేస్తూ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్ స్టార్లు మద్దతుగా నిలిచారు. ప్రజల భద్రత కంటే క్రీడలు ముఖ్యం కాదని, కరోనా విజృంభించిన ప్రస్తుత స్థితిలో వింబుల్డన్‌ను రద్దు చేయడమే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.

Cancel Wimbledon Open
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News