Friday, April 19, 2024

ఆధునికీకరణ నేపథ్యంలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 30 నుంచి మే 7వ తేదీ వరకు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. ఈ నెల 29వ తేదీన, మే 6 తేదీల్లో సికింద్రాబాద్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, ఈ నెల 30, మే 7 తేదీల్లో విశాఖ, – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

Also Read: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!

అలాగే మే 5, 6 తేదీల్లో కాచిగూడ , విశాఖపట్నం, మే 6, 7 తేదీల్లో విశాఖపట్నం, కాచిగూడ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. 6వ తేదీన బిలాస్పూర్, తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు, 6వ తేదీన సికింద్రాబాద్ , విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు, 7వ తేదీన విశాఖ – సికింద్రాబాద్, దురంతో ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే వివరించింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News